IOCL Recruitment 2021: నిరుద్యోగులకు పలు రంగాల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఇప్పటికే ఎన్నో ఉద్యోగ నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి. ఇప్పుడు తాజాగా ఇంజనీర్లకు ఐఓసిఎల్ రిక్రూట్‌మెంట్ 2021 నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. గ్రాడ్యుకేట్ అప్రెంటిస్ ఇంజనీర్ ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఇందులో దరఖాస్తు చేసుకునే వారికి గేట్ 2021 స్కోర్‌ల ద్వారా ఎంపిక చేయబడుతుంది.
ఈ పోస్టులకు కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ర్టికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇంజనీర్లు లేదా ఆఫీసర్స్‌గా ఎంపికైన అభ్యర్థులకు వేతనం నెలకు రూ.50,000 నుంచి రూ.1,60,000 వరకు అందించనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. కాగా, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఇంజనీర్లుగా ఎంపికైన వారికి నెలవారీ స్టైఫండ్ చెల్లించనున్నారు.
కెమికల్ ఇంజనీరింగ్: ఇందులో పెట్రోకెమికల్స్, పాలిమర్, ప్లాస్టిక్ ఇంజనీరింగ్, ఆయిల్, పెయింట్ టెక్నాలజీ, సిరామిక్స్ ఇంజనీర్స్.
ఇక ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్‌లో.. ఎలక్ట్రిక్ ఇంజనీర్, ఎలక్ట్రిక్ అండ్ కమ్యూనికేషన్, పవర్ ఇంజనీరింగ్, టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హతలు: అభ్యర్థులు కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి.
ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు జూలై 10 నుంచి జూలై 26వ తేదీ వరకు ఐఓసిఎల్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు తమ ఇమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.