న్యూఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్‌కు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో.. దేశవ్యాప్తంగా ఐబీ పరిధిలోని సబ్సిడియరీ ఇంటెలిజెన్స్ బ్యూరోల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 226 పోస్టులను భర్తీ చేయనున్నారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో 79 పోస్టులు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో 147 పోస్టులు ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు జనవరి 12వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు.
ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలి-కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ ఇంజినీరింగ్/ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ స్పెషలైజేషన్‌లో బీఈ, బీటెక్ డిగ్రీ లేదా ఎలక్ట్రానిక్స్/ ఫిజిక్స్- ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్‌లో ఎంఎస్సీ లేదా కంప్యూటర్ అప్లికేషన్స్‌లో పీజీ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే గేట్ 2021/ 2022/ 2023లో ఏదైనా ఒకదానిలో స్కోరు సాధించి ఉండాలి. జనవరి 12, 2024 నాటికి అభ్యర్ధుల వయసు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.దరఖాస్తు రుసుము కింద జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.200, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. గేట్ స్కోరు/ ఇంటర్వ్యూ, సైకోమెట్రిక్/ ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.44,900 నుంచి 1,42,400 వరకు జీతంగా చెల్లిస్తారు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.