Integral Coach Factory Apprentice Recruitment 2022: భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (Integral Coach Factory).. అప్రెంటీస్ పోస్టుల (Apprentice Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 876
పోస్టుల వివరాలు: ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్, పెయింటర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్ తదితర పోస్టులు.
వయోపరిమితి: జులై 26, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
స్టైపెండ్: నెలకు రూ.6,000ల నుంచి రూ.7,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తులకు చివరి తేదీ: జులై 26, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.