AP SSC Exams: పదో తరగతి విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌.. ఫైనల్‌ ఎగ్జామ్స్‌లో 11 పేపర్లకు బదులు..

|

Jan 05, 2022 | 6:41 PM

కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, ఇప్పుడు ఒమిక్రాన్‌.. ఇలా వదలకుండా పట్టిపీడిస్తోన్న కొవిడ్‌ వైరస్‌ కారణంగా విద్యార్థులపై ఒత్తిడి బాగా పెరిగిపోయింది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఏపీ పదోతరగతి విద్యార్థులకు అక్కడి ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది

AP SSC Exams: పదో తరగతి విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌.. ఫైనల్‌ ఎగ్జామ్స్‌లో 11 పేపర్లకు బదులు..
Ap Ssc Exams
Follow us on

కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, ఇప్పుడు ఒమిక్రాన్‌.. ఇలా వదలకుండా పట్టిపీడిస్తోన్న కొవిడ్‌ వైరస్‌ కారణంగా విద్యార్థులపై ఒత్తిడి బాగా పెరిగిపోయింది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఏపీ పదోతరగతి విద్యార్థులకు అక్కడి ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఈ మేరకు 2022 మార్చిలో జరగనున్న 2021–22 విద్యాసంవత్సరం పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలను11 పేపర్లకు బదులు 7 పేపర్లతోనే నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన జీవోను ధ్రువీకరిస్తూ ఏపీ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మెయిన్‌ పరీక్షలతో పాటు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు కూడా కేవలం ఏడు పేపర్లు మాత్రమే ఉండనున్నాయి.

కరోనా వల్ల గతేడాదితో పాటు ఈ ఏడాది ఏపీలో జరగాల్సిన పదో తరగతి పరీక్షలు రద్దైన సంగతి తెలిసిందే. విద్యార్థులను ఆల్‌పాస్‌గా ప్రకటించి మార్కులు, గ్రేడ్లు లేకుండా సర్టిఫికెట్లు ఇచ్చారు. దీనివల్ల విద్యార్థులు ఆపై తరగతుల్లో చేరేందుకు, కొన్ని ఉద్యోగాలకు దరఖాస్తు చేసేందుకు సమస్యలు ఎదుర్కొన్నారు. అందుకే ఈ ఏడాదైనా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది. ఇందులో భాగంగానే 2022 సంవత్సరం మార్చి నుంచి ఈ కొత్త విధానం అమలులోకి రానుంది.ఈ పరీక్షల్లో సామాన్యశాస్త్రంకు మినహా మిగతా అన్నీ సబ్జెక్టులకు ఒకే పేపర్‌ ఉంటుంది. ప్రతి పేపర్‌లో 33 ప్రశ్నలు 100 మార్కులకు ఉంటాయి. సామాన్యశాస్రంలో భౌతిక, రసాయన శాస్త్రాలు కలిపి 50 మార్కులకు.. జీవశాస్త్రం ఒక్కటే 50 మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం 3.15 గంటలు ఉంటుంది. ఇక విద్యార్థులకు సమాధాన పత్రానికి 24 పేజీల బుక్ లెట్ ను ఇవ్వనున్నారు.

Also Read:

Coronavirus: సినిమా ఇండస్ట్రీని వదలనంటోన్న కరోనా.. మహమ్మారి బారిన బాలీవుడ్ బుల్లితెర బ్యూటీ.. వాటిని నమ్మోద్దంటూ ఇన్‌స్టాలో పోస్ట్‌..

Viral news: బెడిసికొట్టిన ప్రి వెడ్డింగ్‌ ఫొటోషూట్‌.. బురదలో పడిన వధూవరులు.. నెటిజన్లు ఏమంటున్నారంటే..

Viral news: ఒకటి.. రెండు కాదు.. ఏకంగా 11 సార్లు కరోనా టీకా తీసుకున్న ఘనుడు.. ఆశ్చర్యపోయిన అధికారులు..