Indian Oil Jobs 2023: రాత పరీక్షలేకుండా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. టెన్త్‌/ఐటీఐ అర్హత ఉంటే చాలు..

|

Jan 22, 2023 | 9:11 PM

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో.. ఒప్పంద ప్రాతిపదికన 39 డ్రిల్లింగ్‌, వర్క్‌ ఓవర్‌ ఆపరేటర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల..

Indian Oil Jobs 2023: రాత పరీక్షలేకుండా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. టెన్త్‌/ఐటీఐ అర్హత ఉంటే చాలు..
Indian Oil Corporation Limited
Follow us on

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో.. ఒప్పంద ప్రాతిపదికన 39 డ్రిల్లింగ్‌, వర్క్‌ ఓవర్‌ ఆపరేటర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదోతరగతితోపాటు, డీజిల్‌ మెకానిక్‌/ఫిట్టర్‌/ఎలక్ట్రీషియన్‌/టర్నర్‌/మెషినిస్ట్‌ తదితర ట్రేడుల్లో డిప్లొమా లేదా సైన్స్ స్ట్రీమ్‌లో డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 18 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఈ అర్హతలున్నవారు 2023, జనవరి 30, 31, ఫిబ్రవరి1, 3 తేదీల్లో తేదీ కింది అడ్రస్‌లో నిర్వహించే ఇంటర్వ్యూకి నేరుగా హాజరు కావచ్చు. ట్రేడ్‌ టెస్ట్‌/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి రూ.19,500ల వరకు జీతంతోపాటు ఇతర అలవెన్సులు కూడా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్..

Employee Welfare Office,
Nehru Maidan, Oil India
Limited, Duliajan, Assam.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.