AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navy Jobs: ఇండియన్‌ నేవీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారా.? రేపే చివరి తేదీ.. బీటెక్‌ చేసిన వారు అర్హులు..

Navy Jobs 2022: బీటెక్‌ అర్హతతో ఇండియన్‌ నేవీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. కేరళలోని ఎంజిమలలోని ఇండియన్‌ నేవల్‌ అకాడమనీ జనవరి 2023 నుంచి ప్రత్యేక నావల్ ఓరియంటేషన్ కోర్సు కోసం..

Navy Jobs: ఇండియన్‌ నేవీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారా.? రేపే చివరి తేదీ.. బీటెక్‌ చేసిన వారు అర్హులు..
Narender Vaitla
|

Updated on: Aug 14, 2022 | 7:08 PM

Share

Navy Jobs 2022: బీటెక్‌ అర్హతతో ఇండియన్‌ నేవీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. కేరళలోని ఎంజిమలలోని ఇండియన్‌ నేవల్‌ అకాడమనీ జనవరి 2023 నుంచి ప్రత్యేక నావల్ ఓరియంటేషన్ కోర్సు కోసం స్వీకరిస్తోన్న దరఖాస్తుల స్వీకరణ సోమవారం (ఆగస్టు 15)తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ ఎగ్జిక్యూటివ్(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)లో 50 పోస్టులను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీఈ, బీటెక్‌, ఎంటెక్‌, ఎంఎస్సీ(కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ సైన్స్ అండ్‌ ఇంజినీరింగ్/ కంప్యూటర్ ఇంజినీరింగ్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్/ సైబర్ సెక్యూరిటీ/ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ & నెట్‌వర్కింగ్/ కంప్యూటర్ సిస్టమ్స్ అండ్‌ నెట్‌వర్కింగ్/ డేటా అనలిటిక్స్/ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్). లేదా ఎంసీఏ, బీసీఏ/ బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

* అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల మాత్రమే ఇందుకు అర్హులు.

* దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 02-01-1998 నుంచి 01-07-2003 మధ్య జన్మించి ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను డిగ్రీ, పీజీలో వచ్చిన మార్కులు.. పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్‌ వంటి అంశాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ రేపటితో (15-08-2022) ముగియనుంది.

* నోటిఫికేషన్ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?