Indian Navy SSC: బీటెక్‌ విద్యార్హతతో ఇండియన్‌ నేవీలో ఉద్యోగాలు.. పెళ్లి కానీ పురుషులు అర్హులు. ఇంటర్వ్యూ ద్వారానే.

Indian Navy SSC Recruitment 2021: ఇండియన్‌ నేవీ ఇటీవల వరుస నోటిఫికేసన్లు జారీ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా బీటెక్‌ విద్యార్హత కలిగిన వారికి శుభవార్త చెప్పింది. ఎలక్ట్రికల్‌ బ్రాంచ్‌లలో షార్ట్‌ సర్వీస్‌ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది...

Indian Navy SSC: బీటెక్‌ విద్యార్హతతో ఇండియన్‌ నేవీలో ఉద్యోగాలు.. పెళ్లి కానీ పురుషులు అర్హులు. ఇంటర్వ్యూ ద్వారానే.
Indian Navy Ssc 2021

Edited By:

Updated on: Jul 10, 2021 | 9:21 PM

Indian Navy SSC Recruitment 2021: ఇండియన్‌ నేవీ ఇటీవల వరుస నోటిఫికేసన్లు జారీ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా బీటెక్‌ విద్యార్హత కలిగిన వారికి శుభవార్త చెప్పింది. ఎలక్ట్రికల్‌ బ్రాంచ్‌లలో షార్ట్‌ సర్వీస్‌ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 50 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో ఎంపికైన వారికి ముందుగా శిక్షణ ఇస్తారు. దరఖాస్తుల ప్రక్రియ జులై 16 నుంచి ప్రారంభమవుతోన్న నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* జనరల్‌ సర్వీస్‌ (జీఎస్‌)-ఎస్‌ఎస్‌సీ ఎలక్ట్రికల్‌ బ్రాంచ్‌లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* ఈ పోస్టులకు కేవలం అవివాహితులైన పురుషులు మాత్రమే అర్హులు.
* అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణత సాధించడంతో పాటు నిర్దేశించిన శారీర ప్రమాణాలు తప్పనిసరిగా ఉండాలి.
* అభ్యర్థులు 1997 జనవరి 2 నుంచి 2002 జులై 1 మధ్యలో జన్మించి ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* ఎంపికైన అభ్యర్థులకు కేరళలోని ఇండియన్‌ నేషనల్‌ అకాడమీ, ఎజిమళలో శిక్షణ ఇస్తారు.
* నిజానికి ఈ పోస్టుల భర్తీకి ఎంట్రన్స్‌ పరీక్షను నిర్వహిస్తారు. కానీ కోవిడ్‌ నేపథ్యంలో అకాడమిక్‌ మెరిట్‌ ఆధారంగా షార్ట్‌లిస్టింగ్‌ చేసి ఇంటర్వ్యూకు ఆహ్వానించనున్నారు.
* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ 16-07-2021న ప్రారంభమై 30-07-2021న ముగియనుంది.
* ఇంటర్వ్యూలు 2021 సెప్టెంబర్‌లో ఉంటాయి.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: TS Eamcet: తెలంగాణ ఎంసెట్‌కు రికార్డు స్థాయిలో దరఖాస్తులు.. ఇప్పటి వరకు ఎంత మంది అప్లై చేసుకున్నారో తెలుసా?

BDL Recruitment: హైదరాబాద్‌ బీడీఎల్‌లో ఉద్యోగాలు.. స్పోర్ట్స్‌ కోటా ద్వారా పోస్టుల భర్తీ. ఎవరు అర్హులంటే.

SBI Clerk Prelims 2021: నేటి నుంచి ఎస్‌బీఐ క్లర్క్‌ రాత పరీక్ష.. కేంద్రాల వద్ద కోవిడ్‌ నిబంధనలు తప్పనిసరి