ILBS Recruitment 2021: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివ‌ర్ అండ్ బిలియ‌రీ సైన్సెస్‌లో ఉద్యోగాలు.. 90 ఖాళీలు, ఎవ‌రు అర్హులంటే..

|

Jun 14, 2021 | 6:04 AM

ILBS Recruitment 2021: దేశ రాజ‌ధాని న్యూఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివ‌ర్ అండ్ బిలియ‌రీ సైన్సెస్ (ఐఎల్‌బీఎస్‌) ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఇందులో భాగంగా మొత్తం 90 టీచింగ్‌, నాన్ టీచింగ్ పోస్టుల‌ను...

ILBS Recruitment 2021: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివ‌ర్ అండ్ బిలియ‌రీ సైన్సెస్‌లో ఉద్యోగాలు.. 90 ఖాళీలు, ఎవ‌రు అర్హులంటే..
Ilbs Jobs
Follow us on

ILBS Recruitment 2021: దేశ రాజ‌ధాని న్యూఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివ‌ర్ అండ్ బిలియ‌రీ సైన్సెస్ (ఐఎల్‌బీఎస్‌) ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఇందులో భాగంగా మొత్తం 90 టీచింగ్‌, నాన్ టీచింగ్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనున్న ఈ పోస్టుల‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల‌పై ఓ లుక్కేయండి..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌తలు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 26 టీచింగ్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. వీటిలో ప్రొఫెస‌ర్‌, అడిష‌న‌ల్ ప్రొఫెస‌ర్‌, అసోసియేట్ ప్రొఫెస‌ర్, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టులున్నాయి.

* టీచింగ్ పోస్టులను అనెస్తీషియా, నెఫ్రాల‌జీ, న్యూరాల‌జీ, ప‌ల్మన‌రీ మెడిసిన్‌, ఆంకాల‌జీ, లివ‌ర్ ట్రాన్స్‌ప్లాంట్ స‌ర్జ‌రీ, రీన‌ల్ ట్రాన్స్‌ప్లాంట్ విభాగాల్లో తీసుకోనున్నారు.

* టీచింగ్ పోస్టుల‌కు ద‌రఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు.. సంబంధిత విభాగాల్లో మెడిక‌ల్ పీజీ డిగ్రీ(ఎండీ/ డీఎన్‌బీ/ ఎంసీహెచ్‌) ఉత్తీర్ణ‌తతో పాటు… ప‌ని అనుభ‌వం త‌ప్ప‌నిస‌రి.

* నాన్ టీచింగ్ విభాగంలో మొత్తం 64 ఖాళీల‌కుగాను.. సీనియ‌ర్ ఫెలో, అసిస్టెంట్ ల్యాబ్ మేనేజ‌ర్‌, హెడ్ ఆప‌రేష‌న్స్‌, మేనేజ‌ర్, డిప్యూటీ మేనేజ‌ర్‌, న్యూట్రిష‌నిస్ట్‌, ఎగ్జిక్యూటివ్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* నాన్ టీచింగ్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు.. పోస్టుని అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో డిప్లొమా, బీఎస్సీ(న‌ర్సింగ్‌), బీకాం, పీజీ డిగ్రీ, ఎమ్మెస్సీ ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి. అంతేకాకుండా సంబంధిత విభాగంలో ప‌ని అనుభ‌వం తప్ప‌నిస‌రి.

ముఖ్య‌మైన విష‌యాలు…

* అభ్య‌ర్థుల‌ను ఇంట‌ర్వ్యూ/ రాత ప‌రీక్ష‌/ స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఆసక్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్ ద్వారా ద‌రఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు చివ‌రి తేదీగా 20.07.2021ని నిర్ణ‌యించారు.

* పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: High Blood Pressure : అధిక రక్తపోటుతో ఇబ్బంది పడుతున్నారా..! అయితే మీరు వీటిని తినడం లేదని అర్థం..

Onion Peel Benefits : ఉల్లిపాయ తొక్కలో అద్భుత ఔషధ గుణాలు..! ఆరోగ్యానికి అందమైన జుట్టుకోసం..

Covid Vaccine: నమ్మండి..! వ్యాక్సిన్ వేసుకుంటే మీరు సేఫ్.. తాజా అధ్యయనంలో వెల్లడి