MINT Recruitment 2021: హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ మింట్ సంస్థ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలోని ఈ సంస్థలో మొత్తం 15 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎవరు అర్హులు.? లాంటి పూర్తి వివరాలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా సూపర్ వైజర్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, ఎంగ్రేవర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* సూపర్ వైజర్ పోస్టులకు అప్లై చేసుకునే వారు బ్యాచిలర్ డిగ్రీ (బీఈ/బీటెక్)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
* ల్యాబొరేటరీ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు బ్యాచిలర్ డిగ్రీ (బీఎస్సీ) ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
* ఎంగ్రేవర్ పోస్టులకు అప్లై చేసుకునే వారు బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (స్ల్కప్చర్, పెయింటింగ్) పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను ఆన్‌లైన్ పరీక్షలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
* సూపర్ వైజర్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 27600 నుంచి రూ. 95910, ల్యాబొరేటరీ అసిస్టెంట్ పోస్టులకు నెలకు రూ. 21450 నుంచి రూ. 7160, ఎంగ్రేవర్ పోస్టులకు నెలకు రూ. 23910 నుంచి రూ. 85570 వరకు చెల్లిస్తారు.
* దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 27-12-2021న ప్రారంభమవుతుండగా, 27-12-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Crime News: కాపాలా ఉండాల్సిన వారే కామాంధులుగా మారారు.. స్పాలో పనిచేస్తున్న యువతులను లాక్కెళ్లి…!