Indian Bank Jobs: బ్యాంక్‌ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా? ఇండియన్ బ్యాంక్‌లో 128 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు..

|

Feb 22, 2023 | 10:00 PM

తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై కేంద్రంగా ఉన్న ఇండియన్ బ్యాంక్.. 128 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ షార్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఐటీ/కంప్యూటర్‌ ఆఫీసర్‌, ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ, మార్కెటింగ్‌ ఆఫీసర్‌..

Indian Bank Jobs: బ్యాంక్‌ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా? ఇండియన్ బ్యాంక్‌లో 128 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు..
Indian Bank
Follow us on

తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై కేంద్రంగా ఉన్న ఇండియన్ బ్యాంక్.. 128 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ షార్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఐటీ/కంప్యూటర్‌ ఆఫీసర్‌, ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ, మార్కెటింగ్‌ ఆఫీసర్‌, ట్రెజరీ ఆఫీసర్, ఫారెక్స్‌ ఆఫీసర్‌, ఇండస్ట్రీ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌, హెచ్‌ఆర్‌ ఆఫీసర్‌ పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. విద్యార్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం వంటి వివరాలు వివరణాత్మక నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత తెలుసుకోవచ్చు. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు..

  • ఐటీ/కంప్యూటర్‌ ఆఫీసర్‌ పోస్టులు: 23.
  • ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ పోస్టులు: 7
  • మార్కెటింగ్‌ ఆఫీసర్‌ పోస్టులు: 13
  • ట్రెజరీ ఆఫీసర్ పోస్టులు: 20
  • ఫారెక్స్‌ ఆఫీసర్‌ పోస్టులు: 10
  • ఇండస్ట్రీ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ పోస్టులు: 50
  • హెచ్‌ఆర్‌ ఆఫీసర్‌ పోస్టులు: 5

నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.