Indian Army Recruitment: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖ, ఇండియన్ ఆర్మీకి చెందిన ఉత్తర, దక్షిణ ఏఎస్‌సీ సెంటర్లలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. నోటిఫికేషన్‌లో భాగంగా నార్త్, సౌత్ సెంటర్స్‌లో మొత్తం 458 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏ సెంటర్‌లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 458 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో దక్షిణ ఏఎస్‌సీ సెంటర్‌లో 209 పోస్టులు, ఉత్తర ఏఎస్‌సీ సెంటర్‌లో 249 పోస్టులు ఉన్నాయి.
* దక్షిణ ఏఎస్‌సీ సెంటర్‌లో కుక్, సివిలియన్ కేటరింగ్ ఇన్‌స్ట్రక్టర్, ఎంటీఎస్, టిన్ స్మిత్, బార్బర్, క్యాంప్ గార్డ్ పోస్టులు ఉంగా ఉత్తర ఏఎస్‌సీ సెంటర్‌లో స్టేషన్ ఆఫీసర్లు, ఫైర్‌మెన్లు, ఫైర్ ఇంజిన్ డ్రైవర్లు, ఫైర్ ఫిట్టర్, సివిలియన్ మోటార్ డ్రైవర్ పోస్టులు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఖాళీల ఆధారంగా పదో తరగతి/ తత్సమాన, ఇంటర్మీడియట్, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడుల్లో అనుభవం ఉండాలి. నిర్ధేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి.
* అభ్యర్థుల వయసు పోస్టుల ఆధారంగా 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తులను ది ప్రిసైడింగ్ ఆఫీసర్, సివిలియన్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ బోర్డు, ఏఎస్‌సీ సెంటర్ (దక్షిణం)-2 ఏటీసీ, అగ్రం పోస్టు, బెంగళూరు అడ్రస్‌కు పంపించాలి.
* అభ్యర్థులను రాత పరీక్ష, స్కిల్ టెస్ట్/ ఫిజికల్ టెస్ట్/ ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల రూపంలో మొత్తం 150 మార్కులకు పరీక్షను నిర్వహిస్తారు. పరీక్షా సమయం 2 గంటలు ఉంటుంది. ప్రశ్నాపత్రం ఇంగ్లిష్, హిందీలో ఉంటుంది.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి…