Indian Air Force: ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాల భ‌ర్తీకి ఆన్‌లైన్ టెస్ట్ నోటిఫికేష‌న్‌ విడుద‌ల‌.. జూన్ 1 నుంచి..

|

May 27, 2021 | 10:22 PM

Indian Air Force AFCAT: ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నిర్వ‌హించే ఎయిర్‌ఫోర్స్ కామ‌న్ అడ్మిష‌న్ ఆన్‌లైన్ టెస్ట్ - 2(ఏఎఫ్‌క్యాట్) నోటిఫికేషన్ తాజాగా విడుద‌ల చేశారు...

Indian Air Force: ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాల భ‌ర్తీకి ఆన్‌లైన్ టెస్ట్ నోటిఫికేష‌న్‌ విడుద‌ల‌.. జూన్ 1 నుంచి..
Afcat 2 2021 Recruitment
Follow us on

Indian Air Force AFCAT: ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నిర్వ‌హించే ఎయిర్‌ఫోర్స్ కామ‌న్ అడ్మిష‌న్ ఆన్‌లైన్ టెస్ట్ – 2(ఏఎఫ్‌క్యాట్) నోటిఫికేషన్ తాజాగా విడుద‌ల చేశారు. ఇందులో భాగంలో ఎయిర్ ఫోర్స్‌లోని ప‌ర్మినెంట్‌, షార్ట్ సర్వీస్ కమిషన్లలో ఉన్నత స్థాయి ఉద్యోగాలను భ‌ర్తీ చేయ‌నున్నారు.

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 334 ఖాళీలు భ‌ర్తీ చేయ‌నున్నారు.

* ఏఎఫ్ క్యాట్ ఎంట్రీలో భాగంగా భ‌ర్తీ చేయ‌నున్న బ్రాంచ్‌లు, ఖాళీలు.. ఫ్లైయింగ్-96, గ్రౌండ్ డ్యూటీ (టెక్నిక‌ల్‌)-137, గ్రౌండ్ డ్యూటీ (నాన్ టెక్నిక‌ల్‌)-73

* ఎన్‌సీసీ స్పెష‌ల్ ఎంట్రీలో భాగంగా ఫ్లైయింగ్ విభాగంలో ఒక ఖాళీ భ‌ర్తీ చేయ‌నున్నారు.

* ఇక మెటీయోరాల‌జీ ఎంట్రీలో మెటీయోరాల‌జ‌నీ విభాగంలో మొత్తం 28 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* ఫ్లైయింగ్ బ్రాంచు పోస్టులకు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు జులై 1, 2022 నాటికి 20 నుంచి 24 ఏళ్లలోపు, మిగిలినవాటికి 20 నుంచి 26 ఏళ్లలోపు ఉండాలి.

ముఖ్య‌మైన విష‌యాలు..

* అభ్య‌ర్థుల‌ను ఉమ్మ‌డి ప్రవేశ పరీక్ష, ఇంజినీరింగ్ నాలెడ్జ్ టెస్ట్ (ఈకేటీ), పైలట్ ఆప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్ (పీఏబీటీ), మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ఏఎఫ్‌క్యాట్ ఎంట్రీకి ద‌ర‌ఖాస్తు చేసుకునేవారు ఫీజుగా రూ.250 చెల్లించాలి. మిగ‌తా ఎంట్రీల‌కు ఫీజు చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు.

* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ 01.06.2021 నుంచి ప్రారంభ‌మ‌వుతుండ‌గా.. 30.06.2021ని చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు.

* పూర్తి వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: భారతీయ చట్టాలను మీరు గౌరవించి పాటించాల్సిందే ! ట్విటర్ కి కేంద్రం గట్టి హెచ్చరిక

Duplicate Arrest : వాహనానికి ‘పోలీస్’ అనే స్టిక్కర్ అంటించుకుని మద్యం తరలిస్తోన్న డూప్లికేటు అరెస్ట్

Instagram Reels: ఇకపై ఇన్‌స్టాగ్రమ్‌లో రీల్స్‌ను ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి.. ఆఫ్‌లైన్‌లోనూ వీడియోలను ఆస్వాధించండి..