Update: India Post Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! పోస్టాఫీస్‌లో లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. అసలు నిజం ఇది..

| Edited By: Ravi Kiran

Aug 17, 2022 | 6:41 PM

Update: ''నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! పోస్టాఫీస్‌లో లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఖాళీలున్నాయంటే..'' అని ఇంతకముందు మేము చేసిన పోస్ట్ పూర్తి అవాస్తవమని తెలియజేస్తున్నాం.

Update: India Post Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! పోస్టాఫీస్‌లో లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. అసలు నిజం ఇది..
Indian Post
Follow us on

Update: ”నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! పోస్టాఫీస్‌లో లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఖాళీలున్నాయంటే..” అని ఇంతకముందు మేము చేసిన పోస్ట్ పూర్తి అవాస్తవమని తెలియజేస్తున్నాం. ‘Factly.in’ అనే ఇండిపెండెంట్ ఫ్యాక్ట్ చెక్ వెబ్‌సైట్ దీనిపై వివరణ ఇస్తూ ఆగష్టు 17, 2022 ఓ కథనాన్ని ప్రచురించింది. ఇండియా పోస్ట్.. తమ సర్కిళ్ల వారీగా పోస్ట్‌మాన్, మెయిల్ గార్డ్, ఎంటీఎస్‌ల శాఖలలో ఉన్న ఉద్యోగుల సంఖ్యను తప్పుగా ఉద్యోగాల ఖాళీల సంఖ్యగా పలు జాతీయ మీడియా సంస్థలు ప్రచురించాయని కథనంలో పేర్కొంది. కావున ”నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! పోస్టాఫీస్‌లో లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఖాళీలున్నాయంటే..” మేము చేసిన పోస్ట్ తప్పు(నిరాధారమైంది) అని గమనించగలరు.

Indian Post office Postman and Mail guard Recruitment 2022: నిరుద్యోగులకు కేంద్ర కొలువులు సాధించే అద్భుత అవకాశం! భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియా పోస్ట్‌ (India Post) దాదాపు లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా మొత్తం 23 సర్కిళ్లకుగానూ ఖాళీల వివరాలను తెలియజేస్తూ షార్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. తాజా నోటిఫికేషన్‌ ప్రకారం పోస్ట్‌ మ్యాన్‌ పోస్టులు 59,099, మెయిల్‌ గార్డ్‌ పోస్టులు 1445, మల్టీ టాస్కింగ్‌ పోస్టులు 37,539 వరకు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో భరీగా ఖాళీలున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఖాళీలున్నాయంటే..

ఇవి కూడా చదవండి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఖాళీల వివరాలు..

  • పోస్ట్‌ మ్యాన్‌ పోస్టులు 2289
  • మెయిల్‌ గార్డ్‌ పోస్టులు 108
  • మల్టీ టాస్కింగ్‌ పోస్టులు 1166

తెలంగాణ సర్కిల్‌లో ఖాళీలు..

  • పోస్ట్‌ మ్యాన్‌ పోస్టులు 1553
  • మెయిల్‌ గార్డ్‌ పోస్టులు 82
  • మల్టీ టాస్కింగ్‌ పోస్టులు 878

పోస్టులను బట్టి పదో తరగతి, ఇంటర్‌లో ఉత్తీర్ణతతోపాటు కంప్యూటర్‌ నైపుణ్యాలు కలిగిన అభ్యర్ధులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే అభ్యర్ధుల వయసు 18 నుంచి 32 యేళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఐతే ఖాళీల వివరాలను తెలుపుతూ పోస్టల్ శాఖ షార్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ముఖ్యమైన తేదీలు, ఎంపిక విధానం వంటి ఇతర సమాచారం వివరణాత్మక అధికారిక నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత తెలుసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.