India Post Recruitment 2022: పదో తరగతి/ఇంటర్‌ అర్హతతో పోస్టాఫీస్‌ ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండా ఎంపిక..

|

Nov 07, 2022 | 2:41 PM

భారత ప్రభుత్వ సమాచార మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియా పోస్ట్‌.. 188 పోస్టల్‌ అసిస్టెంట్‌/ సార్టింగ్‌ అసిస్టెంట్‌, పోస్ట్‌మ్యాన్‌/మెయిల్‌ గార్డ్‌, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ..

India Post Recruitment 2022: పదో తరగతి/ఇంటర్‌ అర్హతతో పోస్టాఫీస్‌ ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండా ఎంపిక..
India Post Recruitment 2022
Follow us on

భారత ప్రభుత్వ సమాచార మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియా పోస్ట్‌.. 188 పోస్టల్‌ అసిస్టెంట్‌/ సార్టింగ్‌ అసిస్టెంట్‌, పోస్ట్‌మ్యాన్‌/మెయిల్‌ గార్డ్‌, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్మీడియట్‌ లేదా తత్సామాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే కనీసం 60 రోజుల పాటు కంప్యూటర్ ట్రైనింగ్‌ పూర్తి చేసిన సర్టిఫికేట్‌ ఉండాలి. నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా స్పోర్ట్స్‌ అర్హతలు కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితి విషయంలో సడలింపు వర్తిస్తుంది. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 22, 2022వ తేదీ సాయంత్రం 6 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.100లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌, ట్రాన్స్‌ జండర్‌, మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. విద్యార్హతలు, మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అర్హులైన వారికి కింది విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పోస్టుల వారీగా జీతభత్యాల వివరాలు..

  • అసిస్టెంట్‌/ సార్టింగ్‌ అసిస్టెంట్‌ పోస్టులకు నెలకు రూ.25,500ల నుంచి రూ.81,100ల వరకు జీతంగా చెల్లిస్తారు.
  • పోస్ట్‌మ్యాన్‌/మెయిల్‌ గార్డ్‌ పోస్టులకు నెలకు రూ.21,700ల నుంచి రూ.69,100ల వరకు జీతంగా చెల్లిస్తారు.
  • మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ పోస్టులకు నెలకు రూ.18,000ల నుంచి రూ.56,900ల వరకు జీతంగా చెల్లిస్తారు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.