AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Post Recruitment 2022: పదో తరగతి అర్హతతో పోస్టాఫీసులో ఈ ఉద్యోగాలకు ఇంకా దరఖాస్తు చేసుకోలేదా.. రేపటితో ముగుస్తున్న దరఖాస్తులు..

భారత ప్రభుత్వ సమాచార మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియా పోస్ట్‌ పరిధిలోని బెంగళూరులోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్, మెయిల్ మోటార్ సర్వీస్ (India Post)లో 19 స్టాఫ్ కార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్), జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రేడ్-సి (Staff car driver Posts) పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? దరఖాస్తు ప్రక్రియ రేపటితో..

India Post Recruitment 2022: పదో తరగతి అర్హతతో పోస్టాఫీసులో ఈ ఉద్యోగాలకు ఇంకా దరఖాస్తు చేసుకోలేదా.. రేపటితో ముగుస్తున్న దరఖాస్తులు..
India Post Recruitment 2022
Srilakshmi C
|

Updated on: Sep 25, 2022 | 8:25 AM

Share

India Post Staff car driver Recruitment 2022: భారత ప్రభుత్వ సమాచార మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియా పోస్ట్‌ పరిధిలోని బెంగళూరులోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్, మెయిల్ మోటార్ సర్వీస్ (India Post)లో 19 స్టాఫ్ కార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్), జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రేడ్-సి (Staff car driver Posts) పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? దరఖాస్తు ప్రక్రియ రేపటితో ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు సెప్టెంబర్‌ 26వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆఫ్‌లైన్‌ విధానంలో పోస్టు ద్వారా కింది అడ్రస్‌కు దరఖాస్తులు సమర్పించవల్సి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతిలో ఉత్తీర్ణతతోపాటు వ్యాలిడ్‌ డ్రైవింగ్‌ (లైట్, హెవీ మోటర్‌ వెహికల్స్) లైసెన్స్‌ కూడా ఉండాలి. కనీసం మూడేళ్ల పాటు లైట్, హెవీ మోటర్‌ వెహికల్స్ డ్రైవింగ్‌లో అనుభవం ఉండాలి. మోటార్ మెకానిజంపై అవగాహన ఉండాలి. అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా 18 నుంచి 27 యేళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. డ్రైవింగ్‌ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అర్హులైన వారికి నెలకు రూ.19,900ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్: The Manager, Mail Motor Service, Bengaluru-560001.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.