IIT Recruitment: ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. ఎవరు అర్హులంటే..

|

Nov 21, 2021 | 7:06 AM

IIT Recruitment: భారత ప్రభుత్వానికి చెందిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఖరగ్‌పూర్‌ క్యాంపస్‌లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో..

IIT Recruitment: ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. ఎవరు అర్హులంటే..
Iit Jobs
Follow us on

IIT Recruitment: భారత ప్రభుత్వానికి చెందిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఖరగ్‌పూర్‌ క్యాంపస్‌లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 07 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* ఇందులో భాగంగా జూనియర్‌ రసెర్చ్‌ఫెలో, సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో, రిసెర్చ్‌ అసోసియేట్‌, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌, రిసెర్చ్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉన్నాయి.

* ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఎలక్ట్రికల్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌, మెకానికల్‌ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్‌ అండ్‌ సిస్టమ్స్‌ ఇంజనీరింగ్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టుల ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌, మాస్టర్స్‌ ఇంజనీరింగ్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీటితో పాటు సంబంధిత పనిలో అనుభవం, గేట్‌/ నెట్‌ అర్హత ఉండాలి.

* అభ్యర్థుల వయసు 28 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులను ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 25,000 నుంచి రూ. 47,000 వరకు చెల్లిస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు 23-11-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: ఈ నెలలో విడాకులు ఎక్కువగా తీసుకుంటున్నారట..! కారణాలు ఏంటో తెలుసా..?

Delhi: ఢిల్లీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. పెరుగుతున్న కాలుష్యం కారణంగా కీలక నిర్ణయం..!

Monkey Viral Video: సైకిల్‌పై సరదగా బడికి వెళ్తోన్న వానరం.. వీడియో చూస్తే పడి పడి నవ్వుతారు..!