ముంబాయిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.. 10 అడ్మినిస్ట్రేటివ్ సూపరింటెండెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో నాలుగేళ్ల బ్యాచిలర్స్ డిగ్రీ/మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు పోస్టును బట్టి 32 యేళ్లు మించకుండా ఉండాలి.
ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో ఏప్రిల్ 9, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.50లు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ఈడబ్ల్యూఎప్/మహిళా అభ్యర్ధులు ఫీజు చెల్లించనవసరం లేదు. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు రూ.35,400ల నుంచి రూ.1,42,400ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.