IIT Bombay Recruitment: ముంబయిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో భాగంగా మొత్తం 50 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 50 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* ఎయిరోస్పేస్ ఇంజినీరింగ్, బయో సైన్సెస్ అండ్ బయో ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, సివిల్ ఇంజినీరింగ్, ఎర్త్ సైన్సెస్, హ్యూమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, మ్యాథమేటిక్స్, ఫిజిక్స్ విభాగాల్లో ఈ పోస్టులు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ/ తత్సమాన ఉత్తీర్ణత. కనీసం మూడేళ్ల టీచింగ్/ రిసెర్చ్/ ప్రొఫెషనల్ అనుభవం ఉండాలి.
* అభ్యర్థుల వయసు 35 ఏళ్లు మించకూడదు.
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 1,01,500 జీతంగా చెల్లిస్తారు.
* అభ్యర్థులను మొదట విద్యార్హతల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
* దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీగా 31.10.2021 నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
SSC MTS Admit Card 2021: SSC MTS పరీక్ష అడ్మిట్ కార్డ్ విడుదల.. డౌన్‌లోడ్ ఎలా చేయాలో తెలుసుకోండి..
UPSC Civils-2021: సివిల్స్ లో విజయం సాధించాలంటే ఏం చేయాలి? ర్యాంకర్ల సలహాలు తెలుసుకోండి..