IIOR Recruitment: హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. దరఖాస్తులకు నేడే చివరి తేదీ.

|

Jun 18, 2023 | 9:50 AM

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయిల్‌ సీడ్స్‌ రిసెర్చ్‌ (IIOR) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఐకార్‌ ఆధ్వరంలో పనిచేసే ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ హైదరాబాద్‌లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా హైదరాబాద్‌ శాఖలో ఉన్న యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టులను రిక్రూట్ చేస్తున్నారు. ఆసక్తి, అర్హత ఉన్న...

IIOR Recruitment: హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. దరఖాస్తులకు నేడే చివరి తేదీ.
Icar Jobs
Follow us on

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయిల్‌ సీడ్స్‌ రిసెర్చ్‌ (IIOR) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఐకార్‌ ఆధ్వరంలో పనిచేసే ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ హైదరాబాద్‌లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా హైదరాబాద్‌ శాఖలో ఉన్న యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టులను రిక్రూట్ చేస్తున్నారు. అభ్యర్థులను ఈమెయిల్‌ విధానంలో అప్లై చేసుకోవాలని సూచించారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హతలు ఏంటి.? అభ్యర్థులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? ఎలా ఎంపిక చేస్తారు.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

నోటిఫికేషన్‌లో భాగంగా యంగ్‌ప్రొఫెషనల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో గ్రాడ్యుయేషన్‌/ సీఏ/ ఐసీఎంఏఐ/ సీఎస్‌/ పీజీ డిగ్రీ/ ఎంఎస్సీ/ మాస్టర్స్‌ డిగ్రీ/ ఎంటెక్‌/ ఎంబీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థులను ఇంటర్వ్యూ లేదా టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. విద్యార్హతలో సాధించిన మార్కులు, టెస్ట్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఇంటర్వ్యూలను హైదారాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఉన్న ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ ఆయిల్‌ సీడ్స్‌ రీసెర్చ్‌లో నిర్వహిస్తారు.

ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులను sao.iior@icar.gov.in మెయిల్‌ ఐడీకి పంపించాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు నేటితో (18-06-2023) ముగియనుంది. ఇంటర్వ్యూలను ఈనెల 20,21, 22 తేదీల్లో నిర్వహించనున్నారు. ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్‌ కోసం క్లిక్ చేయండి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్, ఉద్యోగాల కోసం క్లిక్ చేయండి..