IIMC Admissions 2021 : ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (IIMC) PG డిప్లొమా కోర్సుకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీని పొడిగించింది. ఆన్‌లైన్ దరఖాస్తును పూర్తి చేయడానికి ఆగస్టు 15 సాయంత్రం 5 గంటల వరకు పొడగించింది. అంతకు ముందు చివరితేదీ ఆగస్టు 9గా ఉండేది. ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://iimc.nta.ac.in/ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే పరీక్ష తేదీలో ఎలాంటి మార్పు లేదు. ఐఐఎంసి ప్రవేశ పరీక్ష ఆగస్టు 29 న జరుగుతుంది ఫలితాలు సెప్టెంబర్‌లో ప్రకటిస్తారు.
IIMC 2021 దరఖాస్తు రుసుము : జనరల్ కేటగిరీకి, దరఖాస్తు ధర ₹ 1,000, OBC/SC/ST/వికలాంగులు/EWS వర్గానికి, దరఖాస్తు రుసుము ₹ 750 గా నిర్ణయించారు.
IIMC 2021 ప్రవేశాలకు ఎలా దరఖాస్తు చేయాలి..
1. Https://iimc.nta.ac.in/ లో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
2. హోమ్ పేజీలో IIMC ప్రవేశంపై క్లిక్ చేయండి
3. వ్యక్తిగత వివరాలను నింపండి
4. అర్హత వివరాలతో ఆన్‌లైన్ దరఖాస్తు కంప్లీట్ చేయండి.
5. మీ ఫోటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయండి
6. దరఖాస్తు రుసుము చెల్లించండి
7. భవిష్యత్ సూచన కోసం హార్డ్ కాపీని అలాగే మీ వద్ద ఉంచుకోండి
8. ఐఐఎంసికి దేశవ్యాప్తంగా ఆరు క్యాంపస్‌లు ఉన్నాయి. ఆరు క్యాంపస్‌లు న్యూఢిల్లీ, ధెంకనల్, ఐజ్వాల్, అమరావతి, కొట్టాయం మరియు జమ్మూలో ఉన్నాయి. IIMC ఎనిమిది విభిన్న జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ కోర్సులను అందిస్తుంది.