Jobs Recruitment: దేశంలో కొత్త కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాపార కార్యకలాపాలపై కఠినమైన ఆంక్షలు విధించకపోతే జనవరి-మార్చి 2022 త్రైమాసికంలో రిక్రూట్‌మెంట్ పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ టీమ్‌లీజ్ నివేదిక ప్రకారం.. ప్రస్తుత త్రైమాసికంలో నియామక కార్యకలాపాలు 9 శాతం పెరగవచ్చు. కరోనా మహమ్మారి ప్రారంభమైన తర్వాత ఇదే అతిపెద్ద పెరుగుదల అని చెబుతున్నారు. 21 రంగాల్లో దాదాపు ఏడు సెక్టార్లు తమ నియామకాలలో 10 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేసుకున్నాయని నివేదిక పేర్కొంది. ఈ టీమ్‌లీజ్ నివేదిక భారతదేశంలోని 14 నగరాల్లోని 21 ప్రాంతాలలో నియామకాలు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఐటీ రంగంలో ఉద్యోగాలు రావచ్చు
జనవరి-మార్చి 2022లో ఉద్యోగాల విషయంలో ఐటీ రంగం ముందుంటుందని నివేదిక పేర్కొంది. దాదాపు 89 శాతం కంపెనీలు ఈ కాలంలో ఐటీ నిపుణులను నియమించుకోవాలని యోచిస్తున్నాయి. ప్రస్తుత త్రైమాసికంలో విద్యా రంగంలో 80 శాతం, ఆరోగ్యం, వైద్యం రంగంలో 71 శాతం, ఇ-కామర్స్, టెక్నాలజీ స్టార్టప్‌లలో 69 శాతం వరకు రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కనిపిస్తోంది.
దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు వేగంగా పెరుగుతున్నాయి. రోజుకు నమోదయ్యే కరోనా కేసుల సంఖ్య లక్షకు చేరుకుంది. దేశంలో వేగంగా పెరుగుతున్న కొత్త కరోనా కేసుల కారణంగా దేశవ్యాప్తంగా ఆంక్షలు విధిస్తున్నారు. దీని కారణంగా ఉద్యోగాల విషయంలో మరోసారి సంక్షోభాన్ని ఎదుర్కొనే సమస్య ప్రారంభమైంది. పరిస్థితి త్వరగా మెరుగుపడకపోతే, పేద మరియు శ్రామిక వర్గం మళ్లీ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోందని నివేదికలు చెబుతున్నాయి.
ఇవి కూడా చదవండి: