కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ఐసీఎంఆర్ – నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రిసెర్చ్ (ఎన్‌ఐఎంఆర్) .. 61 ప్రాజెక్ట్ టెక్నీషియన్, స్టాటిస్టికల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎడీసీ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రాజెక్ట్ టెక్నీషియన్, స్టాటిస్టికల్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. వయసు 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు ఇంటర్మీడియట్/12వ తరగతి ఉత్తీర్ణత పొంది ఉండాలి. వయసు 25 ఏళ్లకు మించకుండా ఉండాలి.
ఆసక్తి కలిగిన అభ్యర్ధులు సంబంధిత డాక్యుమెంట్లతో 2023, ఏప్రిల్ 10, 12, 18, 21, 24, 27 తేదీల్లో నోటిఫికేషన్‌లో సూచించిన అడ్రస్‌లలో నిర్వహించే ఇంటర్వ్యూకి నేరుగా హాజరుకావచ్చు. షార్ట్‌లిస్టింగ్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.16,000ల నుంచి రూ.31,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.