ICF Jobs 2025: ఇంటర్‌ పాసైన వారికి భలేచాన్స్.. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో భారీగా ఉద్యోగాలు! రాత పరీక్ష లేదు..

2025-26 విద్య సంవత్సరానికి యాక్ట్‌ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ దేశంలోనే అతిపెద్ద రైళ్ల తయారుదారు సంస్థ అయిన ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పదో తరగతితోపాటు ITI పాసైన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. లేదంటే ఇంటర్మీడియట్ పాసైన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ కింద చెక్ చేసుకోవచ్చు..

ICF Jobs 2025: ఇంటర్‌ పాసైన వారికి భలేచాన్స్.. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో భారీగా ఉద్యోగాలు! రాత పరీక్ష లేదు..
ICF Apprentice Jobs

Updated on: Jul 15, 2025 | 11:26 AM

తమిళనాడు రాజధాని చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ.. 2025-26 విద్య సంవత్సరానికి యాక్ట్‌ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 1010 అప్రెంటీస్‌ ఖాళీలను భర్త చేయనున్నారు. ఈ పోస్టులకు టెన్త్‌ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత విభాగంలో (కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెషినిస్ట్, పెయింటర్, వెల్డర్, ఎంఎల్‌టీ రేడియాలజీ, ఎంఎల్‌ పాథాలజీ, పీఏఎస్‌ఏఏ) ఐటీఐ సర్టిఫికేట్‌ తప్పనిసరిగా ఉండాలి. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే సంబంధిత తయారీ యూనిట్‌లలో శిక్షణ పొందేందుకు అవకాశం కల్పిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సంబంధిత ట్రేడులో ఐటీఐ లేదంటే పన్నెండో తరగతిలో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులను అభ్యసించి ఉండాలి. అలాగే అభ్యర్థుల వయోపరిమితి ఆగస్టు 11, 2025 నాటికి తప్పనిసరిగా 155 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. నాన్‌ ఐటీఐ అభ్యర్థులకు 15 నుంచి 22 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో ఆగస్టు 11, 2025వ తేదీలోపు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు ఎటాంటి ఫీజు చెల్లించనవసరం లేదు.

ఎలాంటి రాత పరీక్ష లేకుండానే అకడమిక్ మెరిట్, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఫ్రెషర్స్‌కు రెండేళ్లపాటు, ఐటీఐ పూర్తి చేసిన వారికి ఏడాది పాటు అప్రెంటీస్‌ శిక్షణ ఇస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.6000 నుంచి రూ.7000 వరకు స్టైపెండ్ చెల్లిస్తారు.

ఇవి కూడా చదవండి

ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో అప్రెంటీస్‌ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.