పదో తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం..! ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ నుంచి జాబ్ నోటిఫికేషన్..

| Edited By: TV9 Telugu

May 07, 2024 | 12:21 PM

ICAR IARI Recruitment 2021: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

పదో తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం..! ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ నుంచి జాబ్ నోటిఫికేషన్..
Icar Vacancy
Follow us on

ICAR IARI Recruitment 2021: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్‌ ప్రకారం మొత్తం 641 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్- iari.res.inకి వెళ్లాలి. దరఖాస్తు ప్రక్రియ 18 డిసెంబర్ 2021 నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్- ICAR IARI రిక్రూట్‌మెంట్ 2021ని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్ ఫారమ్‌ను పూరించాలి. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరితేది 10 జనవరి 2022గా నిర్ణయించారు. దరఖాస్తు చేయడానికి ముందు, అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న నోటిఫికేషన్‌ను ఒక్కసారి తనిఖీ చేయండి.

ఈ తేదీలను గుర్తుంచుకోండి
దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: డిసెంబర్ 18, 2021
దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 10, 2022
ఆన్‌లైన్ ఆబ్జెక్టివ్ పరీక్ష తేదీ: జనవరి 25 నుంచి ఫిబ్రవరి 5, 2022

ఇలా దరఖాస్తు చేసుకోండి
1. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి, ముందుగా అధికారిక వెబ్‌సైట్- iari.res.inని సందర్శించండి.
వెబ్‌సైట్ హోమ్ పేజీలో ఇచ్చిన రిక్రూట్‌మెంట్ సెల్ ఎంపికకు వెళ్లండి.
2. ఇందులో ICARలోని వివిధ ఇన్‌స్టిట్యూట్‌లలో టెక్నీషియన్ (T-1) పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం అప్లికేషన్ పోర్టల్ లింక్‌కి వెళ్లండి.
3. ఇప్పుడు అప్లై ఆన్‌లైన్ లింక్‌పై క్లిక్ చేయండి.
4. అడిగిన వివరాలను నింపడం ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయండి.
5. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు దరఖాస్తు ఫారమ్‌ను పూరించవచ్చు.
6. దరఖాస్తును పూర్తి చేసిన తర్వాత ప్రింట్ అవుట్ తీసుకోండి.

ఖాళీ వివరాలు
నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 641 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 286 సీట్లు కేటాయించారు. ఇది కాకుండా ఓబీసీ కేటగిరీలో 133 సీట్లు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 61 సీట్లు, ఎస్సీ కేటగిరీలో 93 సీట్లు, ఎస్టీ కేటగిరీలో 68 సీట్లు ఉంటాయి.

అర్హత & వయో పరిమితి
ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి ప్రత్యేకంగా దరఖాస్తు ఫారమ్‌లో సంబంధిత కాలమ్‌లో మార్కుల శాతాన్ని నింపాలి. అదే సమయంలో దరఖాస్తుదారు వయస్సు 18 సంవత్సరాల కంటే ఎక్కువ 30 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి. రిజర్వేషన్ల పరిధిలోకి వచ్చే అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము
ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేయడానికి, జనరల్, ఆర్థికంగా బలహీనులు EWS, OBC అభ్యర్థులు రూ. 1000 డిపాజిట్ చేయాలి. ఇది కాకుండా SC, ST కేటగిరీకి చెందిన అభ్యర్థులు 300 రూపాయల దరఖాస్తు రుసుమును చెల్లించాలి. దీన్ని డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్‌లైన్ మోడ్‌లో చెల్లించవచ్చు.

Aadhaar: ఆధార్‌ కార్డు లేకుంటే మీ జీవితం అసంపూర్ణమే..! ముఖ్యమైన ఈ పనులకు కచ్చితంగా అవసరం..

సేవింగ్‌ ఖాతాలపై 7% వడ్డీ చెల్లిస్తున్న బ్యాంకులు ఇవే..! మినిమమ్‌ బ్యాలెన్స్‌ ఎంతో తెలుసా..?