CA Exams 2021: డిసెంబర్‌ 5 నుంచి CA పరీక్షల నిర్వహణ.. ICAI మార్గదర్శకాలు తప్పక తెలుసుకోండి..

|

Nov 13, 2021 | 4:28 PM

CA Exams 2021: చార్టర్డ్ అకౌంటెన్సీ పరీక్ష డిసెంబర్ 2021లో జరగనుంది. డిసెంబర్‌ 05, 2021 నుంచి డిసెంబర్ 20, 2021 వరకు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఇన్‌స్టిట్యూట్

CA Exams 2021: డిసెంబర్‌ 5 నుంచి CA పరీక్షల నిర్వహణ.. ICAI మార్గదర్శకాలు తప్పక తెలుసుకోండి..
Ca Exams 2021
Follow us on

CA Exams 2021: చార్టర్డ్ అకౌంటెన్సీ పరీక్ష డిసెంబర్ 2021లో జరగనుంది. డిసెంబర్‌ 05, 2021 నుంచి డిసెంబర్ 20, 2021 వరకు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) పరీక్ష మార్గదర్శకాలను విడుదల చేసింది. COVID-19 మహమ్మారి దృష్ట్యా ICAI, CA పరీక్ష కేంద్రాల సంఖ్యను పెంచింది. ఇప్పుడు CA డిసెంబర్ 2021 పరీక్ష దేశంలోని 192 జిల్లాల్లో నిర్వహిస్తున్నారు. ICAI CA ఫౌండేషన్ పరీక్ష , CA ఇంటర్మీడియట్, CA ఫైనల్ పరీక్షల కోసం దరఖాస్తు ఫారమ్‌ను విడుదల చేసింది. మీరు ICAI వెబ్‌సైట్ icai.orgని సందర్శించడం ద్వారా CA పరీక్షా ఫారమ్‌ను నింపవచ్చు. ఈ ఫారమ్ మళ్లీ ఓపెన్ అవుతుంది.

ICAI CA పరీక్ష సూచనలను అనుసరించండి..
1. పరీక్షకు హాజరు కావడానికి మీరు తప్పనిసరిగా మీ అడ్మిట్ కార్డ్ హార్డ్ కాపీని మీ వెంట తీసుకెళ్లాలి. అభ్యర్థి 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నట్లయితే అతను/ఆమె తనతో పాటు అతని/ఆమె తల్లిదండ్రులు సంతకం చేసిన అండర్‌టేకింగ్‌ను కూడా తీసుకెళ్లాలి.
2. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. సాయంత్రం 4 గంటలలోపు పరీక్షలు ముగించుకున్న విద్యార్థులను కేంద్రం నుంచి బయటకు పంపుతారు.
3. అభ్యర్థులు తమ వెంట వాటర్ బాటిల్ తీసుకెళ్లాలి. అలాగే చిన్నదైన కానీ పారదర్శకమైన శానిటైజర్ బాటిల్‌ని తీసుకెళ్లవచ్చు. పరీక్ష సమయంలో విధుల్లో ఉన్న సిబ్బంది అందరూ తప్పనిసరిగా గ్లౌజులు, మాస్కులు ధరించడం తప్పనిసరి.
4. పరీక్షా కేంద్రాల వద్ద సరిపడా మాస్క్‌లు ఏర్పాటు చేసుకోవాలి. అవసరమైన అభ్యర్థులు పరీక్షా కేంద్రంలో అదనపు మాస్క్‌లను అడగవచ్చు. పరీక్షా కేంద్రం ప్రవేశం, నిష్క్రమణ వద్ద హ్యాండ్ శానిటైజర్ కూడా ఏర్పాటు చేయాలి.
5. ఆరోగ్య సేతు యాప్‌లో పరీక్ష సిబ్బంది అందరికీ ‘నో రిస్క్ స్టేటస్’ ఉండాలి. ఈ యాప్ తప్పనిసరిగా వారి మొబైల్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయాలి.

Kimjongun: కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్యం క్షీణించింది..! నెల రోజులుగా కనిపించడం లేదు..

Komaki నుంచి వెనిస్ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్స్‌ అదిరిపోతున్నాయ్‌.. ఇక Olaకి గట్టి పోటీ..

Lunar Eclipse 2021: నవంబర్ 19న చివరి చంద్రగ్రహణం.. ఈ 2 రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి..