DRDO Recruitment: హైదరాబాద్‌ డీఆర్‌డీఓలో ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక.

|

Oct 09, 2021 | 7:55 PM

DRDO Recruitment 2021: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డీఆర్‌డీవో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. డీఆర్‌డీవో పరిధిలోని సెంటర్‌ ఫర్‌ హై ఎనర్జీ సిస్టమ్స్‌ అండ్‌ సైన్సెస్‌...

DRDO Recruitment: హైదరాబాద్‌ డీఆర్‌డీఓలో ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక.
Follow us on

DRDO Recruitment 2021: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డీఆర్‌డీవో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. డీఆర్‌డీవో పరిధిలోని సెంటర్‌ ఫర్‌ హై ఎనర్జీ సిస్టమ్స్‌ అండ్‌ సైన్సెస్‌ (చెస్‌)లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 08 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో రిసెర్చ్‌ అసోసియేట్‌ (ఆర్‌ఏ), జూనియర్‌ రిసెర్చ్ ఫెలోషిప్‌ (జేఆర్‌ఎప్‌) వంటి పోస్టులు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో పోస్టు గ్రాడ్యుయేషన్‌, బీఈ/ బీటెక్‌/ ఎంటెక్‌ /ఎంఈ, పీహెచ్‌డీలో ఉత్తీర్ణత పొందిఉండాలి.

* అలాగే నెట్‌/గేట్‌ అర్హతతో పాటు సంబంధిత పనిలో అనుభవం కూడా తప్పనిసరిగా ఉండాలి.

* పోస్టులను అనుసరించి అభ్యర్థుల వయసు 28 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులు తమ పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను hrd@chess.drdo.in మెయిల్‌ ఐడీకి పంపించాలి.

* ఎంపికైన వారికి నెలకు రూ. 31,000 నుంచి రూ. 54,000 వరకు చెల్లిస్తారు.

* అభ్యర్థులను మొదట అకడమిక్‌ ఫలితాల ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: RRR Movie: ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కోసం భారీ ప్లాన్.. ప్రచారంలో కొత్త పుంతలు తొక్కిస్తున్న జక్కన్న..

Viral News: భర్త ప్రాణంగా పెంచుకుంటున్న చేపను భార్య వేపుకుని తినేసింది.. ఎందుకంటే?

Mysterious Disease: ఆ దేశాన్ని హడలెత్తిస్తున్న వింత వ్యాధి.. ఇప్పటికే ఆరుగురు మృతి.. పూర్తి వివరాలు