Mysterious Disease: ఆ దేశాన్ని హడలెత్తిస్తున్న వింత వ్యాధి.. ఇప్పటికే ఆరుగురు మృతి.. పూర్తి వివరాలు

Mysterious Brain Disease: కరోనా వైరస్ భయాల నుంచి ఇంకా  కోలుకోక ముందే.. మెదడుకు సంబంధించిన అంతుచిక్కని ఓ వింత వ్యాధి కెనడా ప్రజలను హడలెత్తిస్తోంది.

Mysterious Disease: ఆ దేశాన్ని హడలెత్తిస్తున్న వింత వ్యాధి.. ఇప్పటికే ఆరుగురు మృతి.. పూర్తి వివరాలు
Mysterious Brain Disease
Follow us
Janardhan Veluru

|

Updated on: Oct 09, 2021 | 5:59 PM

Mysterious Brain Disease: కరోనా వైరస్ భయాల నుంచి ఇంకా  కోలుకోక ముందే.. మెదడుకు సంబంధించిన అంతుచిక్కని ఓ వింత వ్యాధి కెనడా ప్రజలను హడలెత్తిస్తోంది. ఆ దేశంలోని బ్రన్‌స్విక్‌ ప్రావిన్స్‌లో వెలుగుచూసిన మెదడుకు సంబంధించిన ఈ వింత వ్యాధి బారినపడి ఇప్పటికే ఆరుగురు మరణించారు. ఇప్పటి వరకు 48 మంది ఈ వ్యాధితో అనారోగ్య బారినపడినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. వీరు మతిమరుపు, తికమకపడటం, ఒత్తిడికి లోనుకావడం, కండరాల నొప్పులు వంటి న్యూరో సిండ్రోమ్ వ్యాధి లక్షణాలతో ఆస్పత్రిపాలవుతున్నారు. ఈ వ్యాధికి గల కారణాలు డాక్టర్లకు కూడా అంతుచిక్కడం లేదు. ఈ వ్యాధి బారినపడుతున్న రోగులు.. తీవ్ర మానసిక సమస్యతో బాధపడుతున్నారు.

ఈ వ్యాధి పట్ల స్థానిక అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యింది. బాధితులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించాలని అధికారులను ఆదేశించింది. ఈ వ్యాధికి కారణాలపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. తాజా నివేదికల ప్రకారం మరణించిన వారందరూ దాదాపు 18 నుంచి 85 యేళ్ల మధ్య వయస్కులు ఉన్నారు. బాధిత రోగులు, ఈ సమస్యతో మరణించిన రోగుల మెదళ్లను స్కానింగ్ తీసి, విశ్లేషించడం ద్వారా వ్యాధికి కారణాలకు నిర్ధారించే పనిలో వైద్య నిపుణులు ఉన్నారు.

ఈ వింత వ్యాధి బారినపడిన ఓ బాలిక.. ఒకే టీవీ షోను పదేపదే చూస్తోంది. టీవీ షోను ఎప్పటికప్పుడు చూడాలన్న తపనతో దానికి బానిసైనట్లు గుర్తించారు. ఆ అమ్మాయి కండరాల సమస్యతోనూ బాధపడుతోంది. గత ఏడాది చివర్లో కూడా ఈ ప్రాంతంలో కొందరు అబ్ నార్మల్ న్యూరో సమస్య బారినపడ్డారు. కరోనా నుంచి కోలుకోక ముందే.. ఇప్పుడు వింత వ్యాధి కెనడా ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది.

ఇప్పటికే అమెరికా దౌత్యవేత్తలు, సైనికాధికారులను మెదడుకు సంబంధించిన ‘హవానా సిండ్రోమ్’ వ్యాధి హడలెత్తిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 200 మందికి పైగా ఈ వ్యాధి బారినపడ్డారు.

Also Read..

Bigg Boss 5 Telugu: బిగ్‏బాస్ సీజన్ 5 ఎలిమినేషన్ ట్విస్ట్.. మరోసారి అమ్మాయి కోసం అబ్బాయి బలి ..?

MAA Elections 2021: ఆ విషయంలో మాకు అన్యాయం జరిగింది.. ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు