AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Black Eyed Beans: శాఖాహారులకు సూపర్ ఫుడ్ అలసందలు.. చౌకగా దొరికే వీటిని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో

Black Eyed Beans Benefits: నవధాన్యాల్లో ఒకటి అలసందలు. వీటిని కొన్ని ప్రాంతాల్లో బొబ్బర్లు అని కూడా అంటారు.  ఫాబేసి కుటుంబానికి చెందిన అలసందలు రెండు రకాలు..

Black Eyed Beans: శాఖాహారులకు సూపర్ ఫుడ్ అలసందలు.. చౌకగా దొరికే వీటిని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో
Black Eyed Beans
Surya Kala
|

Updated on: Oct 09, 2021 | 8:52 PM

Share

Black Eyed Beans Benefits: నవధాన్యాల్లో ఒకటి అలసందలు. వీటిని కొన్ని ప్రాంతాల్లో బొబ్బర్లు అని కూడా అంటారు.  ఫాబేసి కుటుంబానికి చెందిన అలసందలు రెండు రకాలు. ఒకటి తీగ మాదిరిగా అల్లుకోగా, రెండవది చెట్టు వలె పెరుగుతుంది. చిక్కుడు మొక్కలో ఒకరకమే అలసందలు.  ఇవి రుచికరంగా ఉండడమే కాదు ఆరోగ్యాన్ని  ఇచ్చే చౌకగా లబించే ప్రోటీన్ ఉన్న శాకాహారం. వీటిలో మాంసకృత్తులు, కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి. ఈరోజు అలసందలు ఆరోగ్యానికి ఇచ్చే  మేలు గురించి తెలుసుకుందాం.

అలసందల్లో ఇనుము, మెగ్నీషియం, కాల్సియం, ఫాస్ఫరస్, లాంటి ఖనిజ లవణాలు ఉన్నాయి. థయామిన్, రైబోఫ్లెవిన్, నియాసిన్ వంటి  విటమిన్లు ఉన్నయని ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆయువేదం పేర్కొంది.

ముఖ్యంగా మలబధ్ధకం సమస్యతో ఇబ్బంది పదుతున్నవారు రోజూ అలసంద గుగ్గిళ్ళు తింటే మల విసర్జ ఈజీగా అవుతుందని ఆయుర్వేదం చెబుతుంది. అంతేకాదు షుగర్ పేషేంట్స్ కు అలసందలు చాలా ఆరోగ్యకరం. ఇవి బ్లడ్ షుగర్ లెవల్స్ ను నార్మల్ గా ఉంచడంలో సహాయపడతాయి.

ఇక అలసందలు రక్తంలో కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తాయి.  ముఖ్యంగా గుండె సంబంధ వ్యాధులనుంచి రక్షణ ఇస్తాయి.  ముఖ్యంగా అలసందల్లో ఉండే ఫ్లెవనాయిడ్స్, మినిరల్స్ పొటాషియం, మెగ్నిషయం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

బరువు తగ్గాలనుకునేవారికి అలసందలు మంచి ఆహారం. వీటిల్లో తక్కువ క్యాలరీలు, కొవ్వు పదార్దాలు ఉండడంతో ఈజీగా బరువు తగ్గుతారు. ఇక ఆకలి కూడా త్వరగా వేయదు.

అలసందల్లో యాంటీఆక్సిడెంట్స్, మరియు విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. కొన్ని రకాల వ్యాధులను నివారించడంలో మంచి సహకార ఈ ఫుడ్.   అంతేకాదు ఆక్సిజన్ ఫ్రీ రాడికల్స్ ను శరీరం నుండి తొలగిస్తాయి.

అలసందల్లో ఉండే అధిక ప్రోటీన్ కంటెంట్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.  ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ ఎ, సిలు ఫ్రీరాడికల్స్ నుండి చర్మానికి హానిజరగకుండా, చర్మ కణాలను రక్షిస్తాయి.

అలసందల్లో పుష్కలంగా విటమిన్ k ఉంది. ఇది మెదడు చురుగ్గా పనిచేయటంలో దోహదపడుతుంది. అంతేకాక నరాలకు కూడా బలాన్నిస్తుంది. వీటిల్లో ఉండే ఐరన్,మెగ్నీషియం మన ఎనర్జీ లెవెల్స్ పెరిగేలా చేస్తాయి.

తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను ఇచ్చే అలసందలు ఇక నుంచి రెగ్యులర్ ఆహారంలో చేర్చుకోండి. ఆరోగ్యంగా ఉండండి.

Also Read: Playboy Model Ju Isen: రూ. 15 కోట్ల విలువైన ఆస్థిని తన పెంపుడు కుక్క ఫ్రాన్సిస్కో కు రాసిన మోడల్.. ఎక్కడంటే ..