Business Plan: తక్కువ పెట్టుబడితో అదిరిపోయే లాభాలు.. ఆ పంట సాగుతోనే సాధ్యం

ప్రతి ఇంట్లో నిత్యం వాడే కొత్తిమీర సాగువైపు దృష్టి పెట్టాలని నిపుణులు చెబుతున్నారు. ప్రతి సీజన్‌లో పచ్చి కొత్తిమీరకు మార్కెట్‌లో డిమాండ్‌ ఉంటుంది. ఫైబర్, కాల్షియం, కాపర్, ఐరన్, విటమిన్-ఎ, విటమిన్ సి, విటమిన్ కె, కెరోటిన్ వంటి ఉపయోగకరమైన అంశాలు కొత్తిమీరలో ఉంటాయి. దేశమంతటా కొత్తిమీర పండుతుంది. దేశంలో డజనుకు పైగా కొత్తిమీర రకాలను సాగు చేస్తున్నారు. కొత్తిమీర పంటకు సిద్ధం కావడానికి రెండున్నర నుంచి మూడున్నర నెలల సమయం పడుతుంది.

Business Plan: తక్కువ పెట్టుబడితో అదిరిపోయే లాభాలు.. ఆ పంట సాగుతోనే సాధ్యం
Coriander Crop

Edited By: Ravi Kiran

Updated on: Dec 08, 2023 | 9:15 PM

ప్రస్తుత రోజుల్లో యువత ఉద్యోగం కంటే వ్యాపారం మంచిదని కోరుకుంటున్నారు. ముఖ్యంగా వ్యాపారంతో పాటు సాగు అభిరుచి ఉన్నవాళ్లు తక్కువ పెట్టుబడి పంట సాగు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇలాంటి వారు ప్రతి ఇంట్లో నిత్యం వాడే కొత్తిమీర సాగువైపు దృష్టి పెట్టాలని నిపుణులు చెబుతున్నారు. ప్రతి సీజన్‌లో పచ్చి కొత్తిమీరకు మార్కెట్‌లో డిమాండ్‌ ఉంటుంది. ఫైబర్, కాల్షియం, కాపర్, ఐరన్, విటమిన్-ఎ, విటమిన్ సి, విటమిన్ కె, కెరోటిన్ వంటి ఉపయోగకరమైన అంశాలు కొత్తిమీరలో ఉంటాయి. దేశమంతటా కొత్తిమీర పండుతుంది. దేశంలో డజనుకు పైగా కొత్తిమీర రకాలను సాగు చేస్తున్నారు. కొత్తిమీర పంటకు సిద్ధం కావడానికి రెండున్నర నుంచి మూడున్నర నెలల సమయం పడుతుంది. కానీ రైతులు దాని పచ్చి ఆకులను విత్తిన ఒక నెల తర్వాత విక్రయించడం ద్వారా ఆదాయాన్ని పొందవచ్చు. కాబట్టి కొత్తిమీర సాగు గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. 

వాతావరణం 

కొత్తిమీర సాగుకు సమశీతోష్ణ వాతావరణం మరింత అనుకూలంగా ఉంటుంది. ఆమ్ల గుణాలు కలిగిన ఏ రకమైన భూమి అయినా దీనికి అనుకూలంగా ఉంటుంది. ఇది తేలికపాటి శీతాకాలం, ఎండాకాలం ప్రారంభంలో సాగుకు అనుకూలం. అయితే శీతాకాంలో పొగమంచు బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తసుకోవాలి. అలాగే వేసవి కాలంలో ఎండ తగలకుండా తేలికపాటి నీడ ఉన్న ప్రదేశాలలో కొత్తిమీర మంచి దిగుబడిని పొందవచ్చు.

సాగు ఖర్చు, లాభం 

కొత్తిమీర సాగు గిట్టుబాటు అవుతుంది. దీని ఖరీదు హెక్టారుకు దాదాపు 15 వేల రూపాయలు కాగా ఖర్చు తీసిన తర్వాత రైతులు హెక్టారుకు 50 నుంచి 60 వేల రూపాయలు సంపాదిస్తారు. కొత్తిమీర ఉత్పత్తి చేసే రైతులు ఆకులు, విత్తనాలు రెండింటినీ బాగా ఉత్పత్తి చేసే రకాన్ని ఎంచుకోవాలి. విత్తనాలు, ఆకులు రెండింటిలో సమృద్ధిగా ఉన్న రకాల పంటలు సాపేక్షంగా ఎక్కువ సమయంలో తయారు చేస్తారు. మొదట్లో దీని ఆకులను కోసి విక్రయిస్తారు. తరువాత విత్తనాలను విక్రయిస్తారు. ఇలా చేయడానికి మార్కెట్‌లో అనువైన రకాలు చాలా ఉన్నాయి. వాటిని ఎంచుకోవడంలో జాగ్రత్త వహిచాలి. 

ఇవి కూడా చదవండి

కొత్తిమీర రకాలు 

  • మెరుగైన సీడ్  ఆర్‌సీఆర్‌ 435, సింపో ఎస్‌ 33, ఆర్‌సీఆర్‌ 684
  • విశాలమైన ఆకులు ఆర్‌సీఆర్‌ 728, ఏసీఆర్‌ 1, గుజరాత్ కొత్తిమీర – 2
  • ఆకు-విత్తనం  జేడీ-1, పంత్ హరితిమా, ఆర్‌సీఆర్‌ 446, పూసా చయాన్  360

ఫీల్డ్ తయారీ 

కొత్తిమీరను విత్తే ముందు, పొలాన్ని దున్నాలి. అలాగే కొద్దీగా నీరు పెట్టాలి. తద్వారా నేల తేమగా ఉంటుంది. దున్నేటప్పుడు కూడా ఆవు పేడ ఎరువు వాడితే మంచి దిగుబడి వస్తుంది. కూరగాయల్లో ఉపయోగించే కొత్తిమీర ఆకుల దిగుబడికి వేసవిలో కూడా దీని సాగు మంచి లాభాలను ఇస్తుంది. కాగా సుగంధ ద్రవ్యాల కోసం కొత్తిమీరను పొందే రైతులు దాని సాగు కోసం అక్టోబర్ 15 నుంచి సాగు చేసకోవాలి. పొలంలో తేమ ఎక్కువగా ఉంటే హెక్టారుకు 15 నుంచి 20 కిలోల విత్తనాన్ని వేయాలి. కానీ తేమ తక్కువగా ఉంటే విత్తనాల పరిమాణం 25 నుండి 30 కిలోలు ఉండాలి. విత్తే ముందు పంటను వ్యాధుల నుండి రక్షించడానికి విత్తనాలను శుద్ధి చేయాలి. అటువంటి విత్తనాలను విత్తడానిక , దానిని కొద్దిగా రుద్దడం ద్వారా రెండు భాగాలుగా విభజించాలి. ప్రత్యేక నాగలితో వరుసలలో విత్తడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. వరుసల మధ్య దూరం ఒక అడుగు ఉండాలి. అలాగే ఒక గింజకు మరొక విత్తనానికి మధ్య దూరం 4-5 అంగుళాల వరకు ఉండాలి. విత్తనాలను నేల ఉపరితలం నుంచి రెండు అంగుళాల దిగువన నాటాలి. చాలా లోతుగా నాటినప్పుడు చాలా విత్తనాలు మొలకెత్తవు. దీంతో రైతుకు నష్టం వాటిల్లుతోంది. కొత్తిమీర సాగులో నేల అవసరాన్ని బట్టి ఎరువులు వాడాలి.

నీటిపారుదల 

తక్కువ తేమ ఉన్న పొలంలో విత్తిన వెంటనే నీటిపారుదల చేయాలి. అయితే ఎక్కువ తేమ ఉన్న పొలంలో, అవసరమైనప్పుడు మాత్రమే నీటిని పెట్టాలి. మొత్తం కొత్తిమీర పంటలో సాధారణంగా 5 సార్లు తడి పెట్టాల్సి ఉంటుంది. కొత్తిమీర దిగుబడి కలుపు మొక్కల వల్ల దెబ్బతింటుంది. ఎందుకంటే దాని మొక్క చిన్న పరిమాణంలో ఉంటుంది. అందుకే మంచి దిగుబడి పొందడానికి కలుపు తీయడం. వ్యాధుల నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.