HOCL Kerala Graduate and Technician Apprentice Recruitment 2022: భారత ప్రభుత్వ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ మంత్రిత్వ శాఖకు చెందిన కేరళలోని ఎర్నాకుళంలోనున్న హిందుస్థాన్ ఆర్గనిక్ కెమికల్స్ లిమిటెడ్ (HOCL).. 31 గ్రాడ్యుయేట్, టెక్నికల్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి (Graduate and Technician Apprentice vacancies) అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిల్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు 20, టెక్నికల్ అప్రెంటిస్ పోస్టులు 11 వరకు ఉన్నాయి. కెమికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్, కంప్యూటర్ విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత ట్రేడుల్లో ఐటీఐలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఈ అర్హతలున్న వారు ఆన్‌లైన్ విధానంలో సెప్టెంబర్ 30, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో ఎవ్వరూ అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సిన అవసరం లేదు. షార్ట్ లిస్టింగ్, విద్యార్హతలు, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.8000ల నుంచి రూ.10,000ల వరకు స్టైపెండ్ చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.