Hindustan Copper Limited: నెలకు రూ.లక్షకుపైగా జీతంతో హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌లో ఉద్యోగావకాశాలు.. ఈ అర్హతలు అవసరం..

|

Feb 20, 2023 | 9:56 PM

కేంద్ర ప్రభుత్వ గనుల మంత్రిత్వ శాఖకు చెందిన కోల్‌కతాలోని హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌.. 24 డిప్యూటీ మేనేజర్‌, సీనియర్‌ మేనేజర్‌, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ, గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి అర్హులైన..

Hindustan Copper Limited: నెలకు రూ.లక్షకుపైగా జీతంతో హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌లో ఉద్యోగావకాశాలు.. ఈ అర్హతలు అవసరం..
Hindustan Copper Limited
Follow us on

కేంద్ర ప్రభుత్వ గనుల మంత్రిత్వ శాఖకు చెందిన కోల్‌కతాలోని హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌.. 24 డిప్యూటీ మేనేజర్‌, సీనియర్‌ మేనేజర్‌, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ, గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జియోలజీ, సర్వే, ఆర్‌ అండ్‌ డీ, ఎం అండ్‌ సీ, ఫైనాన్స్‌, హెచ్‌ఆర్‌, లా, ఎలక్ట్రికల్‌ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే.. పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ/ సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు 28 నుంచి 47 యేళ్ల మధ్య ఉండాలి.

ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఫిబ్రవరి 28, 2023వ తేదీలోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తు సమయంలో జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.500లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/ఇతర అభ్యర్ధులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్యూటర్‌ బేస్డ్‌ ఆన్‌లైన్‌ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూలో సాధించిన మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.40,000ల నుంచి రూ.1.6 లక్షల వరకు జీతంగా చెల్లిస్తారు. పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.