TS Eamcet 2021: తెలంగాణలో ఇంటర్ సెకండ్ పరీక్షలను రద్దు చేసిన తర్వాత ఎంసెట్ నిర్వహణపై ప్రభుత్వం దృష్టి సారించిన విషయం తెలిసిందే. కరోనా కారణంగా విద్యార్థుల కోసం ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీని అధికారులు పలుసార్లు వాయిదా వేస్తూ వచ్చారు. నిజానికి ఇపాటికే చివరి తేదీ ముగియాల్సి ఉండగా పలుసార్లు వాయిదా వేస్తూ తాజాగా దరఖాస్తుల స్వీకరణకు 19-07-2021ని చివరి తేదీగా నిర్ణయించారు. ఈ విషయమై తెలంగాణ ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎ.గోవర్ధన్ తెలిపారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఏకంగా 2,46,110 మంది విద్యార్థులు ఎంసెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇంజనీరింగ్ విభాగంలో 1,61,823 విద్యార్థులు, అగ్రికల్చర్ మెడికల్ విభాగంలో 84,287 విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇక దరఖాస్తుల స్వీకరణకు మరికొన్ని రోజులు గడువు ఉండడంతో దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య మరింత పెరగనుంది.
ఇదిలా ఉంటే.. ఎంసెట్ పరీక్షలను మొత్తం 9 సెషన్లలో నిర్వహించనున్నారు. అగ్రికల్చర్ వారికి 3, ఇంజినీరింగ్ వారికి 5 సెషన్లు, మరో సెషన్‌ను అవసరాన్ని బట్టి నిర్వహించనున్నట్లు జెఎన్‌టీయూ గతంలోనే తెలిపింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. మరలా తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
* ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఎంసెట్ అధికారిక వెబ్‌సైట్ eamcet.tsche.ac.inలోకి వెళ్లాలి.
* అనంతరం ఆన్‌లైన్ అప్లికేషన్ సెక్షన్‌లోకి వెళ్లాలి.
* తర్వాత ఆన్‌లైన్ అప్లికేషన్‌ఫామ్‌ను నింపి.. ఫీజును చెల్లించాలి.
* ఫొటోగ్రాఫ్, సిగ్నెచర్‌తో అవసరమైన ఇతర డ్యాక్యుమెంట్లను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.
* చివరగా సబ్‌బిట్ నొక్కాలి. అనంతరం భవిష్యత్తు అవసరాల కోసం ఫామ్‌ను ప్రింట్ తీసుకోవాలి.
TCS JOBS : ఫ్రెషర్స్‌కు గుడ్ న్యూస్.. TCS లో 40 వేల ఉద్యోగ అవకాశాలు.. త్వరలో నియామకాల ప్రక్రియ..