TCS JOBS : ఫ్రెషర్స్‌కు గుడ్ న్యూస్.. TCS లో 40 వేల ఉద్యోగ అవకాశాలు.. త్వరలో నియామకాల ప్రక్రియ..

TCS JOBS : దేశంలోని అతిపెద్ద ఐటి సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) ప్రతి సంవత్సరం వేలాది మంది నిరుద్యోగులకు

TCS JOBS : ఫ్రెషర్స్‌కు గుడ్ న్యూస్.. TCS లో 40 వేల ఉద్యోగ అవకాశాలు.. త్వరలో నియామకాల ప్రక్రియ..
Tcs
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: uppula Raju

Updated on: Jul 10, 2021 | 12:09 AM

TCS JOBS : దేశంలోని అతిపెద్ద ఐటి సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) ప్రతి సంవత్సరం వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తోంది. తాజాగా ఫ్రెషర్స్‌కు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021-22) వివిధ క్యాంపస్‌ల నుంచి 40 వేల నియామకాలు చేపట్టనున్నట్లు కంపెనీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం టీసీఎస్‌లో 5 లక్షల మంది పనిచేస్తున్నారు. గతేడాది వివిధ క్యాంపస్‌ల నుంచి 40 వేలమందిని ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. మొత్తం 3.60 లక్షల మంది ఫ్రెషర్స్‌ వర్చువల్‌గా ఎంట్రన్స్‌ టెస్ట్‌కు హాజరయ్యారని టీసీఎస్‌ గ్లోబల్‌ హెచ్‌ఆర్‌ చీఫ్‌ మిలింద్‌ లక్కడ్‌ తెలిపారు.

ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికానికి ఆశాజనక ఫలితాలను ప్రకటించిన మరుసటి రోజే టీసీఎస్‌ ఈ శుభవార్త చెప్పింది. ఉద్యోగులను చేర్చుకునే క్రమంలో కొవిడ్‌ నిబంధనలు అడ్డంకిగా మారలేదని తెలిపారు. ఈ ఏడాది కూడా 40వేల మంది ఫ్రెషర్లను తీసుకోనున్నట్లు లక్కడ్‌ చెప్పారు. వ్యాపార ఒప్పందాలు పుంజుకోగానే నియామకాలు ప్రక్రియ ప్రారంభిస్తామని వివరించారు. దేశంలో ప్రతిభకు కొదవ లేదని కంపెనీ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ ఎన్‌ గణపతి సుబ్రమణియమ్‌ తెలిపారు. ఖర్చు గురించి ఆందోళన లేదన్నారు.

అంతేకాదు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రతి సంవత్సరం వార్షిక కోడింగ్ పోటీ ‘కోడ్‌విటా’ ను కూడా నిర్వహిస్తుంది. ప్రత్యేకత ఏమిటంటే ఈ పోటీ సహాయంతో ప్రతి సంవత్సరం వేలాది మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఈ పోటీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. 2014 నుంచి దీని ద్వారా 11112 ఆఫర్లు వచ్చాయి. 2020 సంవత్సరంలో ‘కాంటెస్ట్ కోడ్విటా’ తొమ్మిదవ ఎడిషన్ నిర్వహించబడింది. ఇది 3417 మందికి ఉపాధి కల్పించింది. గత రెండేళ్లలో ఈ పోటీ ద్వారా ఎంపికైన 250 మంది విద్యార్థులకు కూడా టిసిఎస్‌లో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం లభించింది.

Hyderabad : టిమ్స్‌లో శవాల సొమ్ము కాజేస్తున్న దొంగలు..! ఎవరో కాదు ఆస్పత్రిలో పనిచేసేవారే..

IND vs SL: శ్రీలంకతో జరిగే వన్డే, టీ 20 సిరీస్ వాయిదా.. త్వరలో కొత్త తేదీల ప్రకటన

Corona Third Wave: మూడో దశ ముప్పుకు రెడీగా ఉండండి.. ఆక్సిజన్‌ నిల్వలు.. సరఫరాపై ప్రధాని మోడీ హై లెవల్‌ మీటింగ్‌

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!