Hiring trends 2021: ప్రస్తుత రోజుల్లో యువత ఆలోచనల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఉద్యోగాల విషయంలోనూ యూత్ నయా ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా ఒకప్పటిలా ఉదయం 9కి వెళ్లి సాయంత్రం 5కి ఇంటికి వచ్చేసే ఉద్యోగాలు చేయడానికి యూత్ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. కెరీర్‌లో ఛాలెంజ్ ఉండాలని కోరుకుంటున్నారు. పార్ట్ టైమ్‌గా చేసే వర్క్‌ల మొగ్గు చూపుతున్నారు. హెడ్‌వే.ఏఐ కో ఫౌండర్ సుజాత. ముఖోపాద్యాయ్ ఇదే విషయాన్ని చెబుతున్నారు. ఉద్యోగాల విషయంలో యువత ఆలోచనల్లో వస్తోన్న మార్పులు, నియామకాలపై కరోనా ఎలాంటి ప్రభావం చూపిందిలాంటి అంశాలను ఆమె పంచుకున్నారు. ఆమె తెలిపిన అంశాలు..
ప్రస్తుతం ఐటీ రంగంలో నియామకాలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా యువతను ఎక్కుగా తీసుకుంటున్నారు. యంగ్ ఎంప్లాస్ సరికొత్త ఆలోచనలతో వ్యాపారాన్ని అభివృద్ధి చేయడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. యువతలో ఉండే నేర్చుకోవాలనే జిజ్ఞాస, వారి నైపుణ్యాలను ఉపయోగించే విధానం పనితీరు మెరుగుపడడానికి ఉపయోగపడుతుంది.
పరిస్థితులు ఇప్పుడిప్పుడే క్రమంగా మెరుగుపడుతున్నాయి. ఇక మేనేజర్ స్థాయిలో ఉన్న వారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి పూర్తిగా సమ్మతం తెలుపుతున్నారు. ఒకప్పుడు కచ్చితంగా ఆఫీసుకు వస్తేనే పని చేయగలుగుతామని ఆలోచన ఉండేది కానీ ఇప్పుడు ఆ మైండ్‌సెట్‌లో స్పష్టమైన మార్పు వచ్చింది. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం ద్వారా ఎక్కడో ఉన్న వారు మరెక్కడో ఉన్న ఉద్యోగాలను చేస్తున్నారు. ఇది ఎన్నో కొత్త అవకాశాలులభించడానికి కారణమవుతున్నాయి. క్లయింట్‌ల కోరిక మేరకు పెద్ద ఎత్తున ఉద్యోగులను తీసుకోవాల్సి వస్తుంది. దీంతో రిక్రూట్‌మెంట్ టీమ్‌పై ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగం కోసం వచ్చే ఎక్కువ మంది అభ్యర్థుల్లో నైపుణ్యం ఉన్న వారిని ఎంపిక చేయడం కష్టంగా మారుతోంది.
అవును.. రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఎక్కువ మంది యువతను తీసుకుంటూండడం నేనూ గమనించాను. క్యాంపస్ రిక్రూట్‌మెంట్ పెరుగుతోంది. కానీ ప్రతీ కథకు రెండు వైపులు ఉంటాయి. కంపెనీలు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ద్వారా పెద్ద ఎత్తున అభ్యర్థులను తీసుకుంటున్నాయన్న దాన్ని నేను అంగీకరిస్తాను.. కానీ ఫ్రెషర్స్ కంపెనీకి అవసరమైన నైపుణ్యాలను వెంటనే నేర్చుకొని పనిచేయాల్సి ఉంటుంది. కానీ ఇదంతా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో కావడం కాస్త ఇబ్బందికరంగా మారుతోంది. ఇందులో మంచి, చెడులు రెండూ ఉన్నాయి.
ఈ రోజుల్లో ప్రతీ కంపెనీ డిజిటల్ వైపు మొగ్గు చూపుతున్నాయి. అలాగే ప్రతీ పనిలో డిజిటలైజేషన్ తప్పనిసరిగా మారింది. ఈ క్రమంలోనే యువత కూడా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పై అవగాహన పెంచుకోవాలి. ఇప్పుడు ఇదే ట్రెండ్ కొనసాగుతుంది. ఇప్పుడు యువత ఫుల్ టైమ్ కాకుండా పార్ట్ టైమ్ వర్క్‌వైపు దృష్టి సారిస్తున్నారు. ఇక కంపెనీలు కూడా దీనిని తప్పు పట్టడం లేదు.. ఈ రకమైన కల్చర్‌ను ఎంకరేజ్ చేస్తున్నాయి.
ప్రస్తుతం కొత్త టెక్నాలజీల వినియోగం పెరుగుతున్న కారణంగా ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరిగింది. అలా అనీ రిక్రూట్‌మెంట్ అంత సులభంగా కూడా ఏమీ లేదు. కొత్త టెక్నాలజీకి చెందిన వారినే కాకుండా కంపనీలు.. వివిధ నైపుణ్యాలున్న అభ్యర్థుల కోసం చూస్తున్నాయి. సాధారణంగా కొన్ని ఐటీ కంపెనీలు పూర్తి స్థాయిలో నైపుణ్యాలు ఉండాలని భావిస్తుంటారు. కానీ నేను గమనించిన కొన్ని కంపెనీలు అభ్యర్థులను ప్రాథమిక సామర్థ్యాలపై కూడా దృష్టి పెడుతున్నాయి. ఉదాహరణకు ఓ అభ్యర్థికి క్లౌడ్ ఆర్కిటెక్చర్ గురించి ముందుగానే తెలుసా.? ఆ సబ్జెక్టులో అభ్యర్థికి ప్రాథమిక పరిజ్ఞానం ఉందా.? సదరు అభ్యర్థి వెంటనే పనిని ప్రారంభిస్తాడా అన్నఅంశాలను పరిగణలోకి తీసుకుంటారు. ఎందుకంటే ఉద్యోగులను రిక్రూట్ చేసుకున్న తర్వాత వారికి నేర్పించడానికి పెద్దగా సమయం ఉండదు. ఉద్యోగులు వెంటనే ప్రాజెక్ట్ ను ప్రారంభించాలనే ఆలోచనలో కంపెనీలు ఉంటాయి. కాబట్టి యంగ్ అభ్యర్థులను తీసుకోవడంలో ఎలాంటి అభ్యంతరం లేకపోయినప్పటికీ వారికి ప్రాథమిక అంశాలపై మాత్రం కచ్చితంగా అవగాహన ఉండాలని కంపెనీలు భావిస్తున్నాయి.
IDBI Bank Recruitment 2021: ఐడీబీఐ బ్యాంకులో ఉద్యోగాలు.. దరఖాస్తు చివరి తేదీ ఆగస్టు 22
TS Engineering Counselling: తెలంగాణ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల