AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coal India Recruitment 2021 : కోల్‌ ఇండియాలో ఇంజనీర్‌ పోస్టులు..1.6 లక్షల వరకు వేతనం.. పూర్తి వివరాలు తెలుసుకోండి

Coal India Recruitment 2021 : కోల్ ఇండియా లిమిటెడ్ వివిధ ఇంజనీరింగ్ స్ట్రీమ్‌లలో గేట్ 2021 స్కోర్ల ఆధారంగా మేనేజ్‌మెంట్ ట్రైనీల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మైనింగ్, ఎలక్ట్రికల్,

Coal India Recruitment 2021 : కోల్‌ ఇండియాలో ఇంజనీర్‌ పోస్టులు..1.6 లక్షల వరకు వేతనం.. పూర్తి వివరాలు తెలుసుకోండి
Coal India
uppula Raju
|

Updated on: Aug 11, 2021 | 9:10 AM

Share

Coal India Recruitment 2021 : కోల్ ఇండియా లిమిటెడ్ వివిధ ఇంజనీరింగ్ స్ట్రీమ్‌లలో గేట్ 2021 స్కోర్ల ఆధారంగా మేనేజ్‌మెంట్ ట్రైనీల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మైనింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, జియాలజీ సహా వివిధ విభాగాల కోసం మొత్తం 588 ఖాళీలు ప్రకటించారు. ఎంపికైన అభ్యర్థులు రూ.1.6 లక్షల వరకు వేతనం ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను కోల్ ఇండియా. ఇన్‌లో సమర్పించవచ్చు. దరఖాస్తు ప్రక్రియ మంగళవారం (ఆగస్టు 10) ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. సెప్టెంబర్ 9 (11:59 pm) వరకు కొనసాగుతుంది.

పోస్టులను బట్టి సంబంధిత సబ్జెక్టుల్లో B.E/B.Tech/B.Sc. (Engg) విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లయ్‌ చేసుకోవచ్చు. అలాగే.. జియాలజీ విభాగంలోని ఉద్యోగాలకు సంబంధిత సబ్జెక్టులో M.Sc/ M.Tech చేసిన వారు అప్లయ్‌ చేసుకునేందుకు అర్హులు. వేతంనం 1.6 లక్షల వరకు ఉంటుంది. ప్రాథమిక వేతనంతో పాటు, అభ్యర్థులు డియర్‌నెస్ అలవెన్స్, హెచ్‌ఆర్‌ఏ ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి. వయసు 2021, ఆగస్టు 4 నాటికి 30 ఏళ్లు మించకుండా ఉండాలి. ఇతరులు రూ.1000 పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, కోల్‌ ఇండియా ఉద్యోగులకు ఫీజు లేదు. కోల్ ఇండియా లిమిటెడ్ భారత ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వ శాఖ క్రింద ఉన్న ఒక సంస్థ. దేశంలో 2.55 లక్షల మానవ శక్తి కలిగిన అతిపెద్ద కార్పొరేట్ యజమానులలో ఒకటి. ఇది భారతదేశంలోని ఎనిమిది ప్రావిన్షియల్ రాష్ట్రాలలో (పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఉత్తర ప్రదేశ్ & అస్సాం) 85 మైనింగ్ ప్రాంతాల్లో 345 గనులను నిర్వహిస్తోంది.

PM Modi Photo: కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లపై ప్రధాని మోడీ ఫోటో.. వివరణ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం

Visakhapatnam News : ముంచుకొస్తున్న ప్రమాదం.. వైజాగ్, ముంబైలలో ముందుకొస్తున్న సముద్రం..

Rashmika Mandanna: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న లక్కీ బ్యూటీ.. రష్మిక ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..