Center for Social Service: ఆసరాలేని అనాథ బాలికలకు ఆశ్రయం, ఉచిత విద్య.. ఈ నెంబర్లకు ఫోన్‌ చేయండి

చదువుకోవాలనే ఆశ ఉన్నా చదివించేవారు లేని బాలికల చదువు బాధ్యత మాదేనంటోంది ఈ సంస్థ. ఏ ఆధారం లేని బాలికలు పైచదువులు చదవలేక తమ ఆశలు చంపుకోవల్సిన అవసరం లేదిక. అటువంటి వారికందరికీ మేమున్నామంటూ ముందుకొచ్చీ, ఖర్చులన్నీ భరించి..

Center for Social Service: ఆసరాలేని అనాథ బాలికలకు ఆశ్రయం, ఉచిత విద్య.. ఈ నెంబర్లకు ఫోన్‌ చేయండి
Hayatnagar Center For Social Service

Updated on: May 19, 2023 | 8:27 PM

చదువుకోవాలనే ఆశ ఉన్నా చదివించేవారు లేని బాలికల చదువు బాధ్యత మాదేనంటోంది ఈ సంస్థ. ఏ ఆధారం లేని బాలికలు పైచదువులు చదవలేక తమ ఆశలు చంపుకోవల్సిన అవసరం లేదిక. అటువంటి వారికందరికీ మేమున్నామంటూ ముందుకొచ్చీ, ఖర్చులన్నీ భరించి ప్రయోజకులుగా తీర్చిదిద్దుతోంది హైదరాబాద్‌ హయత్‌నగర్‌లోని సెంటర్‌ ఫర్‌ సోషల్‌ సర్వీస్‌ (సి.ఎస్‌.ఎస్‌.) స్వచ్ఛంద సంస్థ. అనాథ బాలికలు, ఒంటరి తల్లి లేదా తండ్రి ఉన్న విద్యార్థినులను అక్కున చేర్చుకుని వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తోంది. తాజాగా విడుదలైన పదో తరగతి ఫలితాల్లో 2023 ఉత్తీర్ణులైన అనాథ ఆడపిల్లలకు, 80 శాతం మార్కులు సాధించిన తల్లి లేదా తండ్రి లేని సింగిల్‌ పేరెంట్‌ ఆడపిల్లలకు తమ ఆశ్రమంలో ఉన్నత చదువులు చదివేందుకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి కలిగిన వారు 79952 33348, 70938 00896 నంబర్లను సంప్రదించొచ్చు.

ఓ ఐఎఫ్‌ఎస్‌ అధికారి భార్య విజయలక్ష్మి 2004లో ఈ సంస్థను ప్రారంభించారు. భర్త మరణం తర్వాత ఒంటరి తల్లిగా ఆమె పడ్డ ఇబ్బందులు మరెవరూ పడకూడదన్న ఆలోచనతో ఈ సంస్థను ప్రారంభించారు. తొలుత పది మంది విద్యార్థినులతో ప్రారంభమైన ఈ ఆశ్రమం ఏటా 80 మంది విద్యార్థినులకు ఉచిత విద్య, వసతి సౌకర్యం కల్పిస్తోంది. ఈ సంస్థ సహకారంతో చదువు పూర్తి చేసుకున్న ముగ్గురు యువతులు అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. మరో ముగ్గురు ప్రస్తుతం అక్కడ ఎంఎస్‌ చదువుతున్నారు. ఇక్కడ చదువుకున్న విద్యార్ధినుల్లో చాలా మంది హైదరాబాద్‌లోని టాటా, డెలాయిట్‌, వంటి ప్రముఖ ఎంఎన్‌సీ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. వీరు 2009లో ‘నిమ్మగడ్డ ఆనందమ్మ మెమోరియల్‌ గర్ల్స్‌ స్కూల్‌’ పేరుతో ఓ స్కూల్‌ కూడా ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.