HAL Recruitment: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో టీచింగ్ పోస్టులు.. దరఖాస్తులకు రేపే చివరి తేదీ..
HAL Recruitment 2022: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నవరత్న కేటగిరీకి చెందిన ఈ భారత ప్రభుత్వ రంగ సంస్థ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనుంది...
HAL Recruitment 2022: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నవరత్న కేటగిరీకి చెందిన ఈ భారత ప్రభుత్వ రంగ సంస్థ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనుంది. దరఖాస్తుల స్వీకరణకు రేపటితో (28-05-2022) గడువు ముగియనున్న నేపథ్యంలో ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 37 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* ఇంగ్లిష్, మ్యాథ్స్, బయాలజీ, హిందీ, ఫిజిక్స్, హిస్టరీ/ ఎకనామిక్స్, లైబ్రరీ సైన్స్ విభాగాల్లో పీజీటీ, టీజీటీ, పీఆర్‌టీ పోస్టులు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, మాస్టర్ డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 31.03.2022 నాటికి 21 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులు తమ దరఖాస్తులను vsvidyalaya@yahoo.comకి పంపించాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు రేపటితో (28-05-2022) గడువు ముగియనుంది.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..