HAL Recruitment: హైదరాబాద్‌ హెచ్‌ఏఎల్‌లో అప్రెంటిస్‌ ట్రెయినీ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక..

|

Jan 07, 2022 | 7:47 PM

HAL Recruitment: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకి చెందిన హిందుస్థాన్‌ ఎయిరోనాటిక్స్‌ లిమిటెడ్‌లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. హైదరాబాద్‌లోని ఈ సంస్థలో ఉన్న పలు ట్రెయినీ అప్రెంటిస్‌..

HAL Recruitment: హైదరాబాద్‌ హెచ్‌ఏఎల్‌లో అప్రెంటిస్‌ ట్రెయినీ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక..
Follow us on

HAL Recruitment: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకి చెందిన హిందుస్థాన్‌ ఎయిరోనాటిక్స్‌ లిమిటెడ్‌లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. హైదరాబాద్‌లోని ఈ సంస్థలో ఉన్న పలు ట్రెయినీ అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? లాంటి పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 150 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో టెక్నీషియన్‌ (డిప్లొమా) అప్రెంటిస్‌ ట్రెయినీలు (80), గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ట్రెయినీలు (70) ఉన్నాయి.

* టెక్నీషియన్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత పొంది ఉండాలి. 2019,2020,2021లో ఉత్తీర్ణులైన వారే మాత్రమే అర్హులు.

* గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ట్రెయినీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణ పొంది ఉండాలి. 2019,2020,2021లో ఉత్తీర్ణులైన వారే మాత్రమే అర్హులు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* టెక్నీషియన్‌ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 8000, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ట్రెయినీలకు నెలకు రూ. 9000 స్టైపెండ్‌గా చెల్లిస్తారు.

* అభ్యర్థులను మెరిట్‌ మార్కులు, రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ 07-01-2022న మొదలవుతుండగా, చివరి తేదీగా 19-01-2022తో ముగియనుంది.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Hyderabad: నిరుపేదలకు వైద్యం అందించే దిశగా జీహెచ్ఎంసీ అడుగులు.. మరో 27 బస్తీ దవాఖానలు త్వరలో ఏర్పాటు

AP: పోలీస్ స్టేషన్​‌లో సీజ్ చేసిన 2 బైక్స్ మిస్సింగ్.. విచారణ చేసిన పోలీసులకు దిమ్మతిరిగే షాక్

Andhra Pradesh PRC: పీఆర్సీపై జగన్ కీలక ప్రకటన.. లైవ్ వీడియో