GSCARDB Recruitment 2022: బ్యాంక్‌ జాబ్స్‌ కోసం ఎదురు చూస్తున్నారా? ఈ బ్యాంక్‌లో 150 మేనేజర్‌ ఉద్యోగాలు.. ఈ అర్హతలు అవసరం..

|

Nov 12, 2022 | 7:38 AM

గుజరాత్ స్టేట్ కోఆపరేటివ్ అగ్రికల్చర్ అండ్‌ రూరల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ లిమిటెడ్‌లో.. 150 జనరల్‌ మేనేజర్‌, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌, సీనియర్‌ మేనేజర్‌ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌..

GSCARDB Recruitment 2022: బ్యాంక్‌ జాబ్స్‌ కోసం ఎదురు చూస్తున్నారా? ఈ బ్యాంక్‌లో 150 మేనేజర్‌ ఉద్యోగాలు.. ఈ అర్హతలు అవసరం..
GSCARDB Recruitment 2022
Follow us on

గుజరాత్ స్టేట్ కోఆపరేటివ్ అగ్రికల్చర్ అండ్‌ రూరల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ లిమిటెడ్‌లో.. 150 జనరల్‌ మేనేజర్‌, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌, సీనియర్‌ మేనేజర్‌ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెఫలైజేషన్‌లో సీఏ/సీఏఐఐబీ/బీఈ/ఎంఈ/ఎంసీఏ/ఎంకాం/గ్రాడ్యుయేషన్‌/పోస్టు గ్రాడ్యుయేషన్‌ లేదా తత్సమాన కోర్సులో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్‌ కూడా ఉండాలి. ఆసక్త కలిగిన అభ్యర్ధులు కింది ఈమెయిల్‌ ఐడీకి డిసెంబర్ 15, 2022వ తేదీలోపు దరఖాస్తులను పంపించవల్సి ఉంటుంది. అనంతరం నింపిన దరఖాస్తులను కింది అడ్రస్‌కు ఆఫ్‌లైన్‌ విధానంలో పోస్టు ద్వారా పంపించవల్సి ఉంటుంది. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • జనరల్ మేనేజర్ పోస్టులు: 2
  • డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులు: 15
  • అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టులు: 16
  • సీనియర్ మేనేజర్ పోస్టులు: 22
  • మేనేజర్ పోస్టులు: 35
  • అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు: 60

అడ్రస్‌: The Managing Director, Gujarat State Cooperative Agriculture & Rural Development Bank Ltd, 489, Ashram Road, Near Nehru Bridge, Ahmedabad-380009.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.