ప్రతిష్టాత్మక కామన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ (సీమ్యాట్) 2023 ప్రకటనను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది. ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించినవారు ఎవరైనా ఈ పరీక్ష రాయవచ్చు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సీమ్యాట్‌లో సాధించిన ర్యాంకు ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు ప్రతీ యేట సీమ్యాట్ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే.
ఎంఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఫార్మసీ అప్టిట్యూడ్ టెస్ట్ (జీప్యాట్) 2023 నోటిఫికేషన్ కూడా ఎన్టీఏవిడుదల చేసింది. బీఫార్మసీలో ఉత్తీర్ణత పొందిన వారు జీప్యాట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక జీప్యాట్, సీమ్యాట్.. ఈ రెండు పరీక్షలకు వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఆసక్తికలిగిన వారు మార్చి 6వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. క్వశ్చన్ పేపర్ ఇంగ్లిష్ ల్యాంగ్వేజ్‌లో మాత్రమే ఉంటుంది. పరీక్ష మూడు గంటల సమయంలో రాయవల్సి ఉంటుంది. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్లలో చెక్ చేసుకోవచ్చు.
జీమ్యాట్ 2023 నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
సీప్యాట్ 2023 నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.