AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jobs: నిరుద్యోగులకు అలెర్ట్.. ఆ రంగంలో 30 లక్షల కొత్త ఉద్యోగాలు..!

భారత టూరిజం, హాస్పిటాలిటీ రంగంలో ఉద్యోగ అవకాశాలు వేగంగా విస్తరిస్తున్నాయి. 2028 నాటికి ఈ రంగంలో సుమారు 30 లక్షల కొత్త ఉద్యోగాలు ఏర్పడుతాయి. తద్వారా ఈ రంగంలో ఉపాధి పొందే వారి సంఖ్య 1.48 కోట్లకు చేరుకుంటుందని టూరిజం అండ్ హాస్పిటాలిటీ స్కిల్ కౌన్సిల్ (THSC) నివేదిక వెల్లడించింది. దేశ ఆర్థిక వృద్ధితో పాటు యువతకు భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించే ప్రధాన రంగాల్లో ఒకటిగా పర్యాటకం మారనుందని ఆ నివేదిక పేర్కొంది.

Jobs: నిరుద్యోగులకు అలెర్ట్.. ఆ రంగంలో 30 లక్షల కొత్త ఉద్యోగాలు..!
New JobsImage Credit source: Pexels
Janardhan Veluru
|

Updated on: Jul 15, 2026 | 3:59 PM

Share

ఏఐ భయాల నేపథ్యంలో కొత్త ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. మన దేశంలో టూరిజం, హాస్పిటాలిటీ రంగంలో ఉద్యోగ అవకాశాలు భారీగా పెరగనున్నాయి. ఈ రంగంలో 2028 నాటికి సుమారు 30 లక్షల కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుందని టూరిజం అండ్ హాస్పిటాలిటీ స్కిల్ కౌన్సిల్ (THSC) నివేదిక అంచనా వేసింది. దీనివల్ల ఈ రంగంలో ఉపాధి పొందేవారి మొత్తం సిబ్బంది సంఖ్య 1.48 కోట్లకు చేరుకుంటుంది. 2024 నాటికి ఈ రంగంలో 1.18 కోట్ల మంది ఉపాధి పొందుతున్నట్లు ఆ నివేదిక వెల్లడించింది. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి, ఉద్యోగాల కల్పనలో రాబోయే రోజుల్లో పర్యాటక రంగం అత్యంత కీలక పాత్ర పోషించనుందని ఈ నివేదిక అంచనావేసింది.

టీహెచ్‌ఎస్సీ నివేదిక మేరకు హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ సర్వీసెస్ విభాగాల్లో అత్యధికంగా కొత్త ఉద్యోగ నియామకాలు జరగనున్నాయి. ఈ రంగంలో నైపుణ్యం కలిగిన వారితో పాటు.. పాక్షిక నైపుణ్యం కలిగిన వారు, ఎంట్రీ లెవెల్ స్థాయిలో అందరికీ సమానంగా అవకాశాలు లభిస్తాయి. పెరుగుతున్న పర్యాటకం కారణంగా యువతకు పెద్ద ఎత్తున కెరీర్ అవకాశాలు లభించనున్నాయి. ఈ విభాగాల్లో జీతాల పెరుగుదలతో పాటు డిమాండ్ కూడా బాగా పెరుగుతోంది. అంటే అనుభవజ్ఞులతో పాటు ఫ్రెషర్లకు కూడా ఈ రంగంలో భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆ నివేదిక వెల్లడించింది.

ఆ రాష్ట్రాల్లో అత్యధిక ఉద్యోగాలు

టూరిజం, హాస్పిటాలిటీ రంగంలో బస వసతులు, ఫుడ్ సర్వీసెస్ విభాగాల్లో మాత్రమే అత్యధికంగా 93 శాతం మంది ఉపాధి పొందే అవకాశముంది. కొత్త ఉద్యోగాల సృష్టిలో ఈ విభాగాలు ముందంజలో ఉంటాయి. టూరిజం, హాస్పిటాలిటీ రంగంలో సృష్టించే ప్రతి 10 కొత్త ఉద్యోగాల్లో.. 9 ఉద్యోగులు హోటళ్లు, రెస్టారెంట్లు, కేఫ్స్, రిసార్టులు, ఇతర ఫుడ్ సర్వీసెస్ నుంచే ఉంటాయి. ఇక రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే.. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో టూరిజం రంగంలో భారీగా కొత్త ఉద్యోగ అవకాశాలు ఉంటాయి.

ఇవి కూడా చదవండి

ఏఐ భయాలు అక్కర్లేదు

ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్) శకంలో కొత్త ఉద్యోగాల విషయంలో ఆందోళన నెలకొంటున్న వేళ.. పర్యాటక రంగానికి సంబంధించిన ఈ నివేదిక నిరుద్యోగులకు తీపి కబురుగా పరిగణించాలి. ఉద్యోగాల కోసం ఎదురుచూసే యువకులు.. టూరిజం రంగంపై ఫోకస్ చేస్తే మంచి అవకాశాలను అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది.

Also Read: ఉదయం అలసటగా ఉంటోందా..? ఇలా చేస్తే రోజంతా ఫుల్ ఎనర్జీ!

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..