India Post Recruitment 2021 : గత కొన్ని రోజులుగా వరసగా ఆర్మీ, రైల్వే, పోస్టల్ వంటి అనేక సంస్థల్లో ఉగ్యోదలకు నోటిఫికేషన్స్ ను రిలీజ్ అవుతున్నాయి. దీంతో .. నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ.. తమ లక్ ను పరీక్షించుకుంటున్నారు. ఇక తాజాగా మరోసారి ఇండియన్ పోస్టల్ సంస్థ భారీ సంఖ్యలో జాబ్ నోటిఫికేషన్స్ నురిలీజ్ చేసింది. తాజాగా గ్రామీణ డాక్ సేవక్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఛత్తీస్ గఢ్ , కేరళ ల్లో ఏకంగా రెండు వేలకు పైగా పోస్టుల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ పోస్టులకు కోసం దరఖాస్తులను ఆన్ లైన్ లోనే అప్లై చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీ ఏప్రిల్ 7.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు 18 ఏళ్ల నుంచి నలభై ఏళ్ళు వయసు ఉన్నవారై ఉండాలి. ఛత్తీస్ గఢ్, కేరళలో డాక్ సేవక్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మేనేజర్, బ్రాంచ్ పోస్ట్ మేనేజర్ ఖాళీలు ఉన్నాయి.
పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అంతేకాదు కాదు మాథ్స్, ప్రాంతీయ భాష మరియు ఇంగ్లీష్ తప్పని సరిగా ఉండాలి. పదో తరగతి వరకు ప్రాంతీయ భాషను తప్పని సరిగా చదవాలి. వీటితో పాటు కంప్యూటర్ విజ్ఞానం అదనపు క్వాలిఫికేషన్.
కంప్యూటర్ కోర్సు సర్టిఫికెట్ కేంద్ర ప్రభుత్వం నుండి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుండి కానీ లేదంటే ఏదైనా యూనివర్సిటీ, బోర్డు, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్గనైజేషన్ నుంచి పొందిఉండాలి.
పరీక్ష ఫీజు : రూ. 100 అయితే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే ఎస్సి, ఎస్టీ, మహిళలు, ట్రాన్స్ జెండర్స్ తో పాటు దివ్యాంగులకు [ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
Also Read: