GATE 2023 నోటిఫికేషన్‌ విడుదల.. పరీక్ష తేదీలు ఇవే..

|

Aug 31, 2022 | 8:07 PM

దేశ వ్యాప్తంగా ఉన్న పలు ఐఐటీ, నిట్‌ విద్యా సంస్థల్లో 2022-23 విద్యాసంవత్సరానికిగానూ పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (GATE)-2023 నోటిఫికేషన్‌ విడుదలైంది..

GATE 2023 నోటిఫికేషన్‌ విడుదల.. పరీక్ష తేదీలు ఇవే..
Gate 2023
Follow us on

GATE 2023 Notification: దేశ వ్యాప్తంగా ఉన్న పలు ఐఐటీ, నిట్‌ విద్యా సంస్థల్లో 2022-23 విద్యాసంవత్సరానికిగానూ పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (GATE)-2023 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ అర్హత పరీక్షలో సాధించిన ర్యాంకుల ఆధారంగా ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అలాగే కొన్ని ప్రభుత్వ ఉద్యోగాల ఎంపికకు కూడా గేట్ స్కోర్‌ ఉపయోగపడుతుంది. దేశ వ్యాప్తంగా జరగనున్న గేట్‌ ప్రవేశ పరీక్షను ఈ ఏడాది ఐఐటీ కాన్పూర్‌ నిర్వహిస్తోంది. ఇంజినీరింగ్‌, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్‌, సైన్స్‌, కామర్స్‌, ఆర్ట్స్‌..ఏదైనా విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించినవారు ఎవరైనా గేట్‌ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే డిగ్రీ చివరి యేడాది చదువుతున్న విద్యార్ధులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులకు ఎటువంటి గరిష్ఠ వయోపరిమితి లేదు. ఈ అర్హతలున్న విద్యార్ధులు ఆన్‌లైన్‌ విధానంలో సెప్టెంబర్‌ 30, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.1700లు, ఎస్సీ/ఎస్టీ/వికలాంగ/మహిళా అభ్యర్ధులు రూ.850లు దరఖాస్తు రుసుముగా చెల్లించవల్సి ఉంటుంది. గేట్‌ 2023 పరీక్ష వచ్చే యేడాది (2023) ఫిబ్రవరి 4, 5, 11,12 తేదీల్లో జరుగుతుంది. ఫలితాలు మార్చి 16, 2023వ తేదీన ప్రకటించే అవకాశం ఉంది.

ఆన్‌లైన్‌ రాత పరీక్ష విధానం: గేట్‌-2023 పరీక్షను ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తారు. మొత్తం 29 సబ్జెక్టుల్లో ఆబ్జెక్టివ్‌ విధానంలో జరిగే ఈ పరీక్ష 3 గంటల వ్యవధిలో రాయవల్సి ఉంటుంది. ఉంటుంది. 29 సబ్జెక్టుల్లో నిర్వహిస్తారు. నెగెటివ్‌ మార్కింగ్‌ కూడా ఉంటుంది.

ఇతర పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.