Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GATE 2022: ఇంజనీరింగ్ విద్యార్థులు అలర్ట్..! GATE చివరితేది ఎప్పుడంటే..?

GATE 2022: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ 2022 (GATE) కోసం నమోదు చేయడానికి చివరి తేదీ దగ్గరపడింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 24, 2021న

GATE 2022: ఇంజనీరింగ్ విద్యార్థులు అలర్ట్..! GATE చివరితేది ఎప్పుడంటే..?
Gate 2022
Follow us
uppula Raju

|

Updated on: Sep 21, 2021 | 3:15 PM

GATE 2022: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ 2022 (GATE) కోసం నమోదు చేయడానికి చివరి తేదీ దగ్గరపడింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 24, 2021న ముగుస్తుంది. అయితే ఆలస్య రుసుముతో అక్టోబర్ 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్‌పూర్ (IIT ఖరగ్‌పూర్) 2022 ఫిబ్రవరి 5, 6, 12, 13 తేదీలలో పరీక్ష నిర్వహిస్తుంది. ఫలితాలు మార్చి 17న ప్రకటిస్తారు. కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాలకు, నియామకాల కోసం గేట్ నిర్వహిస్తారు. ఈ సంవత్సరం ఐఐటి ఖరగ్‌పూర్ ఈ పరీక్ష బాధ్యతను నిర్వహిస్తోంది. గేట్ అనేది ప్రవేశ పరీక్ష మాత్రమే కాదు ఆప్టిట్యూడ్ పరీక్ష కూడా. గేట్ స్కోరు IIT లు, IISc, అనేక ఇతర సంస్థలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి అవసరం.

GATE 2022 కోసం ఇలా అప్లై చేయండి..

1. ముందుగా అధికారిక వెబ్‌సైట్ గేట్‌కి వెళ్లండి 2. వెబ్‌సైట్‌లో ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయండి 3. మీ పేరు, మొబైల్ నంబర్, ఈ మెయిల్ నమోదు చేయండి 4. లాగిన్ అయి దరఖాస్తు ఫారమ్‌లో అడిగిన మొత్తం సమాచారాన్ని నింపండి 5. ఫోటోను అప్‌లోడ్ చేసి సంతకం చేయండి 6. అప్లికేషన్ ఫీజు చెల్లించండి 7. మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రింట్ తీసుకోండి.

ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ – 02 సెప్టెంబర్ 2021 దరఖాస్తుకు చివరి తేదీ – 24 సెప్టెంబర్ 2021 ఆలస్య రుసుముతో దరఖాస్తు చేయడానికి చివరి తేదీ – 01 అక్టోబర్ 2021 దరఖాస్తులో మార్పులు- 26 అక్టోబర్ నుంచి1 నవంబర్ 2021 వరకు పరీక్ష నగరాన్ని మార్చడానికి చివరి తేదీ – 3 జనవరి 2022 గేట్ పరీక్ష తాత్కాలిక తేదీలు – 2022 ఫిబ్రవరి 5, 6, 12,13 ఫలితాల విడుదల తాత్కాలిక తేదీ – 17 మార్చి 2022

రిజిస్ట్రేషన్ ఫీజు

SC, ST, దివ్యాంగ్, మహిళా అభ్యర్థులందరికీ గేట్ అప్లికేషన్ ఫీజు – రూ.750 ఆలస్య రుసుము మొత్తం ఫీజుతో – రూ.1250 ఇతర అభ్యర్థులందరికీ దరఖాస్తు రుసుము – రూ.1500

Viral Pics: నది ఒడ్డున సేద తీరుతున్న మొసలి.. చిరుత మెరుపు దాడి.. చూస్తే షాక్ అవ్వాల్సిందే!

HDFC Loan: పండగ సీజన్‌లో రుణాలపై హెచ్‌డీఎఫ్‌సీ కీలక ప్రకటన.. రుణ గ్రహీతలకు అదిరిపోయే ఆఫర్‌..!

Raviteja: ఆ సినిమా సీక్వెల్ చేయడానికి రవితేజ అందుకే దూరంగా ఉంటున్నాడా ? నెట్టింట్లో సరికొత్త గాసిప్స్..