Viral Pics: నది ఒడ్డున సేద తీరుతున్న మొసలి.. చిరుత మెరుపు దాడి.. చూస్తే షాక్ అవ్వాల్సిందే!

Leopard Attack Crocodile: అడవి ప్రపంచం నిత్యం ప్రమాదాలతో నిండి ఉంటుంది. ప్రతీ జంతువు తమను తాము రక్షించుకునేందుకు ఎప్పటికప్పుడు తెలివిని, వ్యూహాన్ని...

Viral Pics: నది ఒడ్డున సేద తీరుతున్న మొసలి.. చిరుత మెరుపు దాడి.. చూస్తే షాక్ అవ్వాల్సిందే!
Leopard 1
Follow us
Ravi Kiran

| Edited By: Anil kumar poka

Updated on: Sep 23, 2021 | 5:11 PM

అడవి ప్రపంచం నిత్యం ప్రమాదాలతో నిండి ఉంటుంది. ప్రతీ జంతువు తమను తాము రక్షించుకునేందుకు ఎప్పటికప్పుడు తెలివిని, వ్యూహాన్ని ప్రదర్శిస్తుండాలి. భీకరంగా పోరాడే క్రూర జంతువు కూడా ఏదొక సందర్భంలో ఓటమిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ కోవకు చెందిన కొన్ని దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొసలి, చిరుత రెండూ క్రూరమైన జంతువులే. ఈ విషయం మనందరికీ తెలిసిందే. వేటాడటంతో చిరుతకు ఉన్న తెలివి, సామర్ధ్యం అమోఘమని అంటుంటారు. అలాగే మొసలిని ‘సముద్రపు అలెగ్జాండర్’ అని పిలుస్తారు. మరి బాహుబలి, భల్లాలదేవా లాంటి బలశాలులైన ఈ జంతువులు ఢీ కొంటే ఎలా ఉంటుందో నిదర్శనంగా ఉండే కొన్ని ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది.

Leopar 2

వైరల్ అవుతున్న ఫోటోలను చూస్తే.. ఓ నది ఒడ్డున మొసలి సేద తీరుతోన్న మీరు చూడవచ్చు. అయితే ఆ నిర్లక్ష్యమే దానికి ముప్పు తెచ్చిపెట్టింది. అకస్మాత్తుగా ఓ చిరుత దానిపై మెరుపు దాడికి దిగుతుంది. అవకాశాన్ని అందిపుచ్చుకుని మొసలిని తన పదునైన దవడలతో పట్టుకుంటుంది. చిరుత నుంచి తప్పించుకునేందుకు మొసలి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అయినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఈ పోరాటంలో చివరికి చిరుత పైచేయి సాధిస్తుంది. మొసలిని పక్కనే ఉన్న పొదల్లోకి తీసుకెళ్లిపోతుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లేట్ ఎందుకు మీరు కూడా దానిపై ఓ లుక్కేయండి.!

Leopard

Read Also: ఈ ఫోటోలోని జింకను కనిపెట్టండి.. మీ మెదడుకు మేత వేయండి.. ఈజీగా కనిపెట్టొచ్చు..

గాల్లో ఢీకొన్న రెండు విమానాలు.. దూకేసిన ప్రయాణీకులు.. చివరికి ఏం జరిగిందంటే.!

టీమిండియా కీలక బ్యాట్స్‌మెన్.. బీసీసీఐపై తిరగబడ్డాడు.. కెరీర్‌ను అర్ధాంతరంగా ముగించాడు.. ఎవరో తెలుసా.?

గజరాజుకు కోపమొస్తే ఇంతేనేమో.. అడవి దున్నను కుమ్మేసిందిగా.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారంతే.!