GATE 2022 Notification: గేట్‌ 2022 నోటిఫికేషన్‌ వచ్చేసింది.. పరీక్ష ఎప్పుడు నిర్వహించనున్నారో తెలుసా?

|

Aug 08, 2021 | 5:00 PM

GATE 2021 Notification: ఐఐటీ, ఎన్‌ఐటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఏటా నిర్వహించే గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌)-2022 నోటిఫికేషన్‌ తాజాగా విడుదల చేశారు. జాతీయ స్థాయిలో నిర్వహించే...

GATE 2022 Notification: గేట్‌ 2022 నోటిఫికేషన్‌ వచ్చేసింది.. పరీక్ష ఎప్పుడు నిర్వహించనున్నారో తెలుసా?
Gate 2022
Follow us on

GATE 2022 Notification: ఐఐటీ, ఎన్‌ఐటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఏటా నిర్వహించే గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌)-2022 నోటిఫికేషన్‌ తాజాగా విడుదల చేశారు. జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ పరీక్ష స్కోర్‌ ఉన్నత విద్యతో పాటు కొన్ని ఉద్యోగాలకు కూడా ఉపయోగపడుతుంది. ఇక ఐఐటీలు, నిట్‌ వంటి విద్యాసంస్థల్లో పీజీ లేదా పీహెచ్‌డీ కోర్సులు చేయడానికి గేట్‌ స్కోర్‌ తప్పనిసరి. ఈ ఏడాది గేట్‌ పరీక్షను ఐఐటీ ఖరగ్‌పూర్‌ నిర్వహిస్తుంది.

గేట్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హతలు..

* గేట్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. ఇంజినీరింగ్‌, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్‌, సైన్స్‌, కామర్స్‌, ఆర్ట్స్‌లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం ఫైనల్ ఇయర్‌ చదువుతున్న వారు కూడా అప్లై చేసుకోవచ్చు.
* అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి అంటూ ఏది లేదు.

ముఖ్యమైన విషయాలు..

* ఈ ఏడాది గేట్‌ పరీక్షలో జియోమాటిక్స్‌, నేవల్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ మెరైన్‌ ఇంజినీరింగ్‌ పేపర్లను కొత్తగా యాడ్‌ చేశారు.
* అభ్యర్థులను కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలో వచ్చిన స్కోర్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహించే ఈ పరీక్షలో.. మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు, మల్టిపుల్‌ సెలెక్ట్‌ ప్రశ్నలు, న్యూమరికల్‌ ఆన్సర్‌ టైప్‌ ప్రశ్నలు ఇస్తారు.
* దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానుంది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు సెప్టెంబర్‌ 24 చివరి తేదీ.
* పరీక్షను 20200 ఫిబ్రవరి 5,6,12,13 తేదీల్లో నిర్వహిస్తారు.
* పరీక్షా ఫలితాలను 2022, మార్చి 17న విడుదల చేస్తారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Telangana: తెలంగాణలో క్యాడర్‌ పోస్టులు.. ఉద్యోగ నోటిఫికేషన్‌లకు లైన్‌ క్లియర్‌.. క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం..!

Niper Recruitment: గువహటి నైపర్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక.

Telangana: తెలంగాణ విద్యార్థులకు ముఖ్య గమనిక.. 14న టీఎస్‌ఆర్‌జేసీ ప్రవేశ పరీక్ష..