FCI Recruitment 2022: ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో 5,043 ఉద్యోగాలు.. జోన్ల వారీగా ఖాళీలు ఇవే..

| Edited By: Ravi Kiran

Aug 31, 2022 | 6:03 PM

భారత ప్రభుత్వ ఆహారం, ప్రజా పంపిణీ, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఫుడ్ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (Food Corporation of India).. 5043 అసిస్టెంట్‌, జూనియర్‌ ఇంజనీర్‌ తదితర..

FCI Recruitment 2022: ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో 5,043 ఉద్యోగాలు.. జోన్ల వారీగా ఖాళీలు ఇవే..
Fci
Follow us on

FCI Category 3 Recruitment 2022: భారత ప్రభుత్వ ఆహారం, ప్రజా పంపిణీ, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఫుడ్ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (Food Corporation of India).. 5043 అసిస్టెంట్‌, జూనియర్‌ ఇంజనీర్‌, టైపిస్ట్‌, స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి (Assistant Grade 3 Posts) అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నార్త్‌ జోన్‌, ఈస్ట్ జోన్‌, వెస్ట్ జోన్‌, సౌత్‌ జోన్‌, నార్త్‌ ఈస్ట్‌ జోన్‌లలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌/బీకాం/ఈఈ/ఎంఈ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే టైపింగ్‌ స్కిల్స్, ట్రాన్స్‌లేషన్‌ స్కిల్స్‌, కంప్యూటర్‌ స్కిల్స్‌తోపాటు సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.దరఖాస్తుదారుల వయసు 21 నుంచి 28 యేళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు అక్టోబర్‌ 5, 2022వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ రాత పరీక్ష/స్కిల్‌ టెస్ట్‌/టైపింగ్‌ టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ప్రతిభ కనబరచిన వారికి నెలకు రూ.28,200ల నుంచి రూ.10,03,400ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

రాత పరీక్ష విధానం..

మొత్తం 100 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు 100 మార్కులకుగానూ మొత్తం 60 నిముషాల వ్యవధిలో పరీక్ష రాయవల్సి ఉంటుంది. ఇంగ్లిష్‌ ల్యాంగ్వేజ్‌, రీజనింగ్‌ ఎబిలిటీ, న్యూమరికల్‌ అప్టిట్యూడ్‌, జనరల్‌ స్టడీస్‌ విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి.

ఇవి కూడా చదవండి

జోన్లవారీగా ఖాళీలు..

  • North Zone – 2388
  • South Zone – 989
  • East Zone – 768
  • West Zone – 713
  • North East Zone – 185

ఇతర పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.