భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లోనున్న ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్.. ఒప్పంద ప్రాతిపదికన 8 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. రేడియో డయాగ్నోసిస్ విభాగంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌తోపాటు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ఎమ్మెస్సీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత స్పెషలేజేషన్‌లో నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా అనుభవం కూడా ఉండాలి. అలాగే దరఖాస్తు దారుల వయసు 69 యేళ్లకు మించకుండా ఉండాలి.
ఈ అర్హతలున్నవారు అక్టోబర్ 8, 2022వ తేదీన కింది అడ్రరస్‌ల నిర్వహించే ఇంటర్వ్యూకి నేరుగా హాజరుకావచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు తప్పనిసరిగా రూ.1000లు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళలు/ఇతర అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. విద్యార్హతలు, వయోపరిమితి, ఇంటర్వ్యూ, అనుభవం ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి కింది విధంగా జీతభత్యాలు ఉంటాయి.
పోస్టుల వారీగా పే స్కేల్ వివరాలు..
అడ్రస్: ESIC Medical College, Sanathnagar, Hyderabad, Telangana.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.