AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ESIC New Delhi Recruitment 2022: ఈఎస్ఐసీలో 115 అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఎంప్లాయిస్‌ స్టేట్‌ ఇన్స్యూరెన్స్‌ కార్పొరేషన్‌ (ESIC New Delhi) మెడికల్, డెంటల్‌ ఇన్‌స్టిట్యూట్లలో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా..

ESIC New Delhi Recruitment 2022: ఈఎస్ఐసీలో 115 అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
Esic
Srilakshmi C
|

Updated on: Apr 11, 2022 | 5:21 PM

Share

ESIC New Delhi Associate Professor Recruitment 2022: భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఎంప్లాయిస్‌ స్టేట్‌ ఇన్స్యూరెన్స్‌ కార్పొరేషన్‌ (ESIC New Delhi) మెడికల్, డెంటల్‌ ఇన్‌స్టిట్యూట్లలో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల (Associate Professor Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

ఖాళీల సంఖ్య: 115

పోస్టుల వివరాలు: అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు

విభాగాలు: అనస్తీషియా, బయో కెమిస్ట్రీ, బ్లడ్‌ బ్యాంక్‌, డెర్మటాలజీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌, జనరల్ మెడిసిన్‌, ఆఫ్తల్మాలజీ, ఆర్థోపెడిక్స్‌, పీడియాట్రిక్స్, పాథాలజీ వంటి ఇతర విభాగాల్లో ఖాళీలున్నాయి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 50 ఏళ్లకు మించరాదు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో పోస్టు గ్రాడ్యుయేట్‌ డిగ్రీ (ఎండీ/ఎంఎస్‌) లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

మెడికల్‌ ఇన్‌స్టిట్యూషన్లలో ఉద్యోగాలకు ఈ కింది అడ్రస్‌కు దరఖాస్తులు పంపించాలి. The Regional Director, ESI Corporation, Panchdeep Bhawan, Sector-16, N.I.T., Faridabad-121002, Haryana

డెంటల్‌ ఇన్‌స్టిట్యూషన్లలో ఉద్యోగాలకు ఈ కింది అడ్రస్‌కు దరఖాస్తులు పంపించాలి. The Regional Director, ESI Corporation, DDA Complex Cum Office, 3rd and 4th Floor Rajendra Place, Rajendra Bhawan, New Delhi-110008

దరఖాస్తు రుసుము: రూ.500 (మహిళలు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌లకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది)

దరఖాస్తులకు చివరి తేదీ: మే 11, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

HQ South Western Command Jobs 2022: పది/ఇంటర్‌ అర్హతతో.. ఆర్మీ సౌత్‌ వెస్టర్న్‌ కమాండ్‌లో గ్రూప్‌ ‘సీ’ సివిలియన్‌ పోస్టులు..