DMHO Hyderabad Recruitment 2022: హైదరాబాద్ బస్తీదవాఖానాల్లో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు..రేపే ఇంటర్వ్యూ
తెలంగాణ ప్రభుత్వానికి చెందని హైదరాబాద్‌లోని బస్తీదవాఖానాల్లో నేషనల్ హెల్త్ మిషన్ (NHM) ద్వారా.. మెడికల్ ఆఫీసర్ పోస్టుల (Medical Officer Posts) భర్తీకి అర్హులైన..
DMHO Hyderabad Medical Officer Recruitment 2022: తెలంగాణ ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్‌లోని బస్తీదవాఖానాల్లో నేషనల్ హెల్త్ మిషన్ (NHM) ద్వారా.. మెడికల్ ఆఫీసర్ పోస్టుల (Medical Officer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
ఖాళీల సంఖ్య: 13
పోస్టుల వివరాలు: మెడికల్ ఆఫీసర్ పోస్టులు
వయోపరిమితి: జులై 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 44 ఏళ్లకు మించరాదు.
పే ప్కేల్: నెలకు రూ.42,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టరయ్యి ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరవ్వొచ్చు.
అడ్రస్: డీఎంహెచ్‌ఓ, 4వ అంతస్తు, హరిహర కళా భవన్, ప్యాట్నీ, సికింద్రాబాద్.
ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్ 12, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: